Advertisement
Google Ads BL

డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు..?


నాగార్జున వ్యాఖ్యాతగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు అంటే మరో మూడు వారాల్లో ముగియబోతుంది. 11 వారలు పూర్తి చేసుకుని 12 వ వారంలోకి అడుపెట్టబోతున్న బిగ్ బాస్ సీన్ 4 లో ప్రస్తుతం ఎనిమిదిమంది కంటెస్టెంట్స్ మిగిలారు. ఇక మిగిలి ఉన్న మూడు వారాల్లో ముగ్గురు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. రేపు ఆదివారం ఎలిమినేషన్స్ లో హారిక, మోనాల్, లాస్య, అభిజిత్, సోహైల్, అరియానాలు ఉన్నారు. ఈ ఆరుగురిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే అభిజిత్ మొదటి నుండి సేవ్ అయినట్టుగానే ఈవారం కూడా సేఫ్ జోన్ లోకి వెళ్ళబోతున్నాడట. సోషల్ మీడియా ఓట్స్ ప్రకారం అభిజిత్ సేఫ్ జోన్ లో ఉంటే.. తర్వాత సోహైల్ సేఫ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా చెబుతున్నారు. 

Advertisement
CJ Advs

మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ లాస్య కూడా ఈ వారం సేఫ్ అయ్యి.. నెక్స్ట్ వీక్ కి వెళ్లబోతుంటే.. ఈ వారం బిగ్ బాస్ అమ్మాయిలలో ముగ్గురు డేంజర్ జోన్ లోకి వెళ్లారని అందులో.. ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవడం ఖాయమంటున్నారు. అఖిల్ తో లవ్ ట్రాక్ వేసిన మోనాల్ ని బిగ్ బాస్ సేవ్ చేస్తూ వచ్చాడు. ఆమెకి సింపతీ ఓట్స్, బిగ్ బాస్ హెల్ప్ తో ఇన్ని వారాలుగా హౌస్ లో నిలబడితే.. ఈ వారం తన ఓన్ ఆటతో ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేసింది. అఖిల్ కూడా తన మదర్ వచ్చినప్పటినుండి మోనాల్ తో రిలేషన్ తగ్గించాడు. గత రాత్రి కెప్టెన్సీ టాస్క్ లో హారికాని మోనాల్ తన భుజాల మీద మోసి హారిక కెప్టెన్ అయ్యేలా చేసింది. అక్కడ మరో కంటెస్టెంట్ మోనాల్ ఫ్రెండ్ అఖిల్ కి మోనాల్ హ్యాండ్ ఇచ్చింది.

దానితో అఖిల్ కి మోనాల్ మీద కోపం వచ్చింది. ఇక తర్వాత అరియనా ఎంత స్ట్రయిట్ గా ఆడినా, ఫెయిర్ గేమ్ ఆడినా... ఈ వారం డేంజర్ జోన్ లోనే ఉంది అంటున్నారు. మరోపక్క హరిక కూడా అబ్బాయిలతో పోటీగా ఆడుతున్నప్పటికీ... ఆమె ఓట్స్ పరంగా కాస్త వీక్ గా ఉందని.. ఎలాగూ అవినాష్ ఈ వారం నామినేషన్స్ లో లేడు కాబట్టి సేవ్ అయ్యాడు. ఇక అఖిల్ కెప్టెన్.  మరి ఈ వారం ఫైనల్ గా మోనాల్ - అరియనా - హరికలలో ఎవరో ఒకరు బయటికి వెళ్లాల్సిందే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ అయ్యింది.

Bigg Boss 4: 3 contestants in danger zone:

Bigg Boss 4: Harika, Monal and Ariyana in danger zone
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs