Advertisement
Google Ads BL

పాపం బాలయ్య.. సయ్యేషా కూడా హ్యాండ్ ఇచ్చింది!!


బాలకృష్ణ BB3 కి హీరోయిన్ కష్టాలు తీరడం లేదు. బోయపాటి బాలకృష్ణ కోసం హీరోయిన్స్ ని ఎంపిక చెయ్యలేక చేతులెత్తేస్తున్నాడు. అందరూ షూటింగ్స్ తో హడావిడిగా ఉంటే.. BB3 బ్యాచ్ మాత్రం హీరోయిన్స్ వెతుకులాటలోనే ఉంది.. BB3 మొదలు పెట్టినప్పటినుండి బాలకృష్ణకి సెట్ అయ్యే హీరోయిన్ దొరకడం లేదు. ఏజ్ ప్రాబ్లెమ్, సీనియర్ హీరో అవడం, సీనియర్ హీరోయిన్స్ ఇప్పటికి యంగ్ హీరోల కోసం, స్టార్ హీరోల కోసం చూడడం వలనే బాలయ్యకి భామలు దొరకడం లేదు. గత కొన్ని సినిమాల నుండి అవుట్ డేటెడ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్న బాలయ్యకి BB3 కి వచ్చేసరికి ఆ అవుట్ డేటెడ్ హీరోయిన్స్ కూడా హ్యాండ్ ఇస్తున్నారు.

Advertisement
CJ Advs

ఆఖరుకు అవును ఫేమ్ పూర్ణ ని ఓ హీరోయిన్ గా తీసుకున్న బోయపాటి మరో హీరోయిన్ కోసం చెయ్యని ప్రయత్నాలు లేవు. ముంబై మోడల్ ని బాలయ్య కోసం సెట్ చేసిన బోయపాటికి కరోనా షాకిచ్చింది. సరే తమిళ హీరోయిన్ ఆర్య వైఫ్ సయ్యేషా ని బాలయ్య కోసం ఫైనల్ చేసి ఒప్పించి వెల్ కమ్ చెప్పిన వారానికే సయ్యేషా బాలయ్యకి హ్యాండ్ ఇచ్చి BB3 నుండి తప్పుకుంది. బాలయ్య - బోయపాటి సినిమా నుండి సయేశా వాకవుట్ అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇపుడు సయేశా తప్పుకోవడంతో బోయపాటి, బాలకృష్ణ కోసం ప్రగ్య జైస్వాల్ ని ఖరారు చేసుకుని.. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా టాక్.

Sayesha Walks out of BB3:

Sayesha Saigal Walks out of Balayya - Boyapati film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs