Advertisement
Google Ads BL

మీడియాకి భయపడ్డ ప్రభుదేవా?


తనతో 16 ఏళ్ళు కాపురం చేసిన భార్య రామాలతకి విడాకులిచ్చి మరీ నయనతార ని పెళ్లి చేసుందామనుకున్న ప్రభుదేవాకి నయనతార షాకిచ్చింది. నయనతారతో చాలా ఏళ్ళు ప్రేమాయణం నడిపిన ప్రభుదేవా ముందు వెనక ఆలోచించకుండా భార్యకి విడాకులిచ్చి వార్తల్లో నిలిచాడు. పాపం భార్య కి విడాకులిచ్చినా నయనతారతో మాత్రం పెళ్లి కాలేదు ప్రభుదేవాకి. తర్వాత బాలీవుడ్ సినిమాల్తో బాగా బిజీ అయిన ప్రభుదేవా మళ్ళీ పెళ్లి సోషల్ మీడియాకెక్కింది. ప్రభుదేవా ఓ డాక్టర్ పిల్లని మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ నడుస్తుండగానే.. అసలు ప్రభుదేవా రెండో పెళ్లి ముచ్చట ఎప్పుడో జరిగిపోయింది అంటున్నారు.

Advertisement
CJ Advs

కరోనా టైం అంటే సెప్టెంబర్ లోనే ప్రభుదేవా రెండో పెళ్లి జరిగినట్టుగా చెబుతున్నారు. ప్రభుదేవా పెళ్లి ముంబైలో  జరిగిందని.. ప్రభుదేవా సెకండ్ వైఫ్ కలిసి ముంబై లోనే ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ డాక్టర్ ప్రభుదేవాకి ఎలా పరిచయం అయ్యిందో కూడా చెబుతున్నారు. ప్రభుదేవా వెన్ను నొప్పితో బాధపడుతున్న టైం లోనే ప్రభుదేవాకి ఆ డాక్టర్ అమ్మాయితో పరిచయం ఏర్పడి.. అది కాస్తా ప్రేమకి దారి తీసింది అని.. తర్వాత ప్రభుదేవా ఆమెని వివాహం చేసుకున్నాడని చెబుతున్నారు. మరి ఇంత పెద్ద విషయం ప్రభుదేవా దాచడానికి కారణం మీడియా అని.. తమ రెండో పెళ్లి విషయంలో మీడియా హడావిడి ఇష్టం లేకనే ప్రభుదేవా ఆ విషయం దాచిపెట్టినట్టుగా తెలుస్తుంది. 

Prabhudeva married to physiotherapist in Mumbai:

<strong>Prabhu Deva Gets Married to His Physiotherapist After Rumours</strong>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs