Advertisement
Google Ads BL

రశ్మికకి 'గూగుల్' గుడి కట్టేసింది!!


ఈమధ్యన లక్కీ హీరోయిన్ గా దూసుకుపోతున్న రశ్మికకి టాలీవుడ్ లో భారీ హిట్స్ ఉన్నాయి. విజయ్ దేవరకొండ గీత గోవిందంతో స్టార్ హీరోయిన్ అయ్యింది. అదృష్టం కలిసొచ్చిన ఈ హీరోయిన్ అనతికాలంలోనే స్టార్ హీరోలస సరసన జోడి కట్టింది. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో సిల్లీ కేరెక్టర్ చేసినా.. మహేష్ అనేసరికి రష్మిక ఫెమస్ అయ్యింది. తర్వాత భీష్మ తో సాలిడ్ హిట్ కొట్టిన రష్మిక అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించబోతుంది. చాలా తక్కువ సమయంలోనే ఫెమస్ అయిన రశ్మికకి గూగుల్ తల్లి ఫిదా అయ్యింది. అందుకే రశ్మికకి ఎప్పటికి గుర్తుండిపోయే గుర్తింపు ఇచ్చింది.

Advertisement
CJ Advs

హీరోయిన్స్ లో చాలా అరుదుగా దొరికే గుర్తింపుని ఇప్పుడు రష్మిక సొంతం చేసుకుంది. గూగూల్ 2020 సంవత్సరానికి గాను 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా రష్మిక ఎన్నికైనట్టు గూగుల్ ప్రకటించింది. రష్మిక డ్రెస్సింగ్ స్టయిల్ నచ్చడం వలనే రష్మికాని 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా గుర్తించినట్టుగా సమాచారం. ఇప్పటివరకు 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా' ఎంపికైన వారిలో దిశా పాటని, ప్రియా ప్రకాష్, మనిషి చిల్లర్ లు మాత్రమే ఉంటే...  ఇప్పుడు ఈ ఘనత కన్నడ, తెలుగు భషాల్లో మాత్రమే నటించిన రష్మికకి కూడా దక్కడం మాత్రం షాకిచ్చే విషయమే. అయినప్పటికీ.. రష్మిక నటించిన చాలా చిత్రాలు హిందీ అండ్ తమిళ్ లో కూడా డబ్ అవడంతో రష్మిక కి ఇంత క్రేజ్ వచ్చింది అని.. అందుకే అందరిని వెనక్కి నెట్టి రష్మిక ఈ గూగుల్ నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా ఘనత సాధించినట్టుగా చెబుతున్నారు.

Rashmika Mandanna is the National Crush of India:

Google has chosen Rashmika Mandanna as the National Crush of India
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs