Advertisement
Google Ads BL

కొమరం భీమ్ సూపర్ స్టైలిష్ లుక్!!


రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న RRR షూటింగ్ రాత్రికి పగలకి తేడా లేకుండా.. గడగడలాడే చలిని సైతం లెక్క చెయ్యకుండా రాజమౌళి చిత్రీకరిస్తున్నాడు. కరోనా కారణంగా హడావిడిగా మొదలైన RRR షూటింగ్ అనుకున్న టైం కి రీచ్ కావాలంటే ఆ మాత్రం కష్టాలు తప్పవని రాజమౌళి టీం కి హుకుం జారీచేశాడట. అయితే ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబో సీన్స్ తో మొదలైన RRR షూటింగ్ లో ఎన్టీఆర్ కొద్దిపాటి విరామం తీసుకుని ఫ్యామిలీతో పాటుగా దుబాయ్ చెక్కేసాడు. కరోనా కారణంగా ఆరు నెలలు ఇంటికే పరిమితమైన ఎన్టీఆర్.. పరిస్థితులు చక్కబడడంతో భార్య లక్ష్మి ప్రణతిని, కొడుకు అభయ్ రామ్ ని తీసుకుని దుబాయ్ లో చిన్నపాటి వెకేషన్ ఎంజాయ్ చేసాడు.

Advertisement
CJ Advs

ఎన్టీఆర్ దుబాయ్ ట్రిప్ ముగించుకుని భార్య ప్రణతి, కొడుకు తో సహా ఎయిర్ పోర్ట్ లో అభిమానుల ఫోన్ కి దొరికిపోయాడు. కరోనా లాక్ డౌన్ లో అసలు బయట కాలుపెట్టకుండా, ఏ కెమెరాకి దొరక్కుండా దాక్కున్న ఎన్టీఆర్ ఈమధ్యన దివాళి ఫొటోస్ షూట్ తో అదరగొట్టడమే కాదు... తాజాగా ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ లుక్ బాగా హైలెట్ అయ్యింది. కరోనాతో మాస్క్ కంపల్సరీ కావడంతో ఎన్టీఆర్ మాస్క్ పెట్టుకుని ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చాడు. ఎన్టీఆర్ కొమరం భీం వీడియో తోనే ఎన్టీఆర్ ఫాన్స్ రెచ్చిపోయి పండగ చేసుకుంటే.. తాజాగా ఎన్టీఆర్ ని ఎయిర్ పోర్ట్ లో చూసిన ఫాన్స్ అబ్బా ఏమున్నాడురా భీమ్ అంటూ ఎన్టీఆర్ పిక్స్ ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. నిజంగా సూపర్ ఫిట్ నెస్ తో ఉన్న ఎన్టీఆర్ లుక్ చాలా స్టైలిష్ గా, కూల్ గా కనబడుతుంది. ఇక దుబాయ్ కి చిన్నపాటి ఫ్యామిలీ ట్రిప్ వేసిన ఎన్టీఆర్ తొందరలోనే RRR షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది.

Ntr airport Look Goes Virul :

Ntr Komaram Bheem ultra Stylish look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs