Advertisement
Google Ads BL

బిగ్ బాస్ మంటపై నీళ్లు చల్లిన కంటెస్టెంట్స్!!


బిగ్ బాస్ మరీ చప్పగా ఉందని సోషల్ మీడియా టాక్ తో అలెర్ట్ ఆయిన్ బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ లో హౌస్ మేట్స్ మధ్యన మంట రాజేసింది. నామినేషన్స్ అప్పుడు పులి - మేక కథతో అభిజిత్ - అఖిల్ రెచ్చిపోగా.. సోహైల్ - అభిజిత్ క్లాస్ vs మాస్ గా  రెచ్చిపోయారు. అలాగే హారిక - సోహైల్ మధ్యన ఊత పదాల గొడవ తారాస్థాయిలో జరిగింది. బిగ్ బాస్ స్కెచ్ వేసి అగ్గి రాజేసాడు. ఈ దెబ్బకి అఖిల్ - అభిజిత్ ఇక నాలుగు వారాల పాటు కొట్లాడుకుంటానే ఉంటారని బుల్లితెర ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. దానితో బిగ్ బాస్ హ్యాపీ.

Advertisement
CJ Advs

కానీ ఇక్కడ ఈ సీజన్ కంటెస్టెంట్స్ మామూలోళ్లు కాదు.. హౌస్ లో అడుగుపెట్టినప్పటినుండి.. పర్ఫెక్ట్ గేమ్ ప్లానర్స్ గా మారిన వీరు.. బిగ్ బాస్ వలలో ఎలా పడతారు. నామినేషన్స్ అపుడు కొట్టుకున్నట్టే కనబడినా మళ్ళీ కలిసిపోయి హగ్స్ ఇచ్చేసుకుని కలిసిమెలిసి ఉంటున్నారు. దానితో బిగ్ బాస్ కి సరైన ఫుటేజ్ దొరకడం లేదు. ఈ సోమవారం నామినేషన్స్ ఎఫెక్ట్ రెండు మూడు వారలు ఉంటుంది అని కలలు కన్న బిగ్ బాస్ కి కంటెస్టెంట్స్ ఝలక్ ఇచ్చారు. ఈ వారం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని కావడానికి వారి కుటుంబ సభ్యులు(అమ్మలు) హౌస్ లోకి అడుగుపెట్టారు. 

కానీ కరోనా కరోనా కారణంగా ఓ గ్లాస్ రూమ్ లో కంటెస్టెంట్స్ తల్లులు నిలబడగా... గ్లాస్ లోపల నుండి తమ పిల్లలపై ప్రేమని కురిపించారు. అఖిల్ వాళ్ళ అమ్మని చూడగానే ఎమోషన్ అవ్వగా, హారిక తల్లి, అవినాష్ తల్లి, అరియనా మదర్, అభిజిత్ మదర్ హౌస్ లోకి రాగానే అభి, అఖిల్, సోహైల్, అవినాష్, అరియనా, హారిక, లాస్య అందరూ ఎమోషన్ అయ్యారు. గేమ్ కోసం కొట్లాట పెట్టుకున్నాం కానీ మేము నిజంగా అట్లా ఉండం.. అందరం ఫ్రెండ్స్ అని అవినాష్ అనగానే అభిజిత్ తల్లి అయితే.. కొట్టుకోండి.. అదే మజరా అనగానే అఖిల్ - అభిజిత్ - సోహైల్ లు కలిసిపోయి హగ్ ఇచ్చుకుని సాంగ్ ఏసుకున్నారు. మరి బిగ్ బాస్ ఏదో ప్లాన్ చేస్తే.. కంటెస్టెంట్స్ దాన్ని తిప్పికొట్టారు.

Contestants sprinkle water on Bigg Boss fire :

Bigg boss 4 housemates meet their Parents
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs