Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ నటన అద్భుతం: సీనియర్‌ నటి


జూనియర్ ఎన్టీఆర్ అంటే మాస్ కా బాప్. ఎన్టీఆర్ కి సరైన దర్శకుడు, కథ దొరకాలే కానీ... నట విశ్వరూపం బయటికి తీస్తాడు. రాజమౌళి లాంటి డైరెక్టర్స్ ఎన్టీఆర్ లోని నటనని పిండేస్తారు. ఎన్టీఆర్ నటనకు చిన్నా పెద్దా అంటూ ప్రేక్షకుల్లో తేడా ఉండదు. నందమూరి హీరోల్లో బాలకృష్ణ తర్వాత ఎన్టీఆర్ టాప్. అయితే జనతా గ్యారేజ్ లోని ఎన్టీఆర్ నటనని ఇప్పుడో సీనియర్ హీరోయిన్ తెగ పొగిడేస్తోంది. అలీ తో జాలిగా ప్రోగ్రాం కి వచ్చిన సీనియర్ నటి లేడీస్ టైలర్ ఫేమ్ అర్చన 25 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అలాంటి సీనియర్ నటిని అలీతో జాలిగా ప్రోగ్రాం ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Advertisement
CJ Advs

అయితే ఈ ప్రోగ్రాంలో అలీ అర్చనని తెలుగులో ఈ మధ్యకాలంలో మీరు ఎలాంటి సినిమాలు చూసారు అని అడిగితె ...మంచి సినినిమాలు ఖచ్చితంగాగా చూస్తాను అని చెప్పింది. మరి ఈమధ్య కాలంలో మీరు చూసిన మంచి చిత్రాలు ఏమిటి అని అడగగా.. కీర్తి సురేష్ నటించిన మహానటి, ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలు నచ్చాయని.. ఆ రెండు సినిమాలు వేరే లెవల్లో ఉన్నాయని చెప్పింది. ఇక ఇప్పటి హీరోల్లో ఎవరు బాగా అద్భుతంగా నటిస్తున్నారు అని అలీ అడగగా... జనతా గ్యారేజ్ చూసినప్పుడు అందులోని ఎన్టీఆర్ నటన నాకు బాగా నచ్చింది. అది చాలా కన్వీన్సింగ్ పెరఫార్మెన్స్. 

ఓ హీరో నటన నచ్చింది అంటే ఆ హీరో నటన గురించి చెప్పాలి కదా అంటూ..  జనతా గ్యారేజ్ లో నటించిన మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ అందరికి డ్రీం హీరో. ఆ సినిమాలో ఆయన చాలా ఇన్‌స్పైరింగ్ క్యారెక్టర్ చేసారు. అందులో మోహన్ లాల్ స్పేస్ మోహన్ లాల్ కి ఇచ్చి.. ఎన్టీఆర్ స్పేస్ ఎన్టీఆర్ తీసుకుని నటించడం చాలా కష్టమైన పని. ఛాలెంజింగ్ రోల్ అంటే ఎన్టీఆర్ దే... అసలు తెలుగులో ఇంతమంచి సినిమాలు తెరకెక్కుతున్నాయంటే చాలా సంతోషం కలుగుతుంది అని ఎన్టీఆర్ నటనని పొగిడేసింది నటి అర్చన.

Senior Heroine Praises Hero Jr NTR Acting:

Senior Actress Archana about Jr NTR at Alitho Jaligaa Show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs