Advertisement
Google Ads BL

సమంత షో.. ‘ఆహా’ అనేలా లేదుగా..!


తెలుగులో సమంతకి సినిమా అవకాశాలు రావడం లేదా? లేదంటే సమంతానే రిజెక్ట్ చేస్తుందా? అనేది ఎవ్వరికి స్పష్టత లేని విషయం. తమిళంలో సినిమా ఒప్పుకున్న సమంత తెలుగులో అదిగో ఇదిగో అనడమే కానీ.. సమంత ఒప్పుకున్న తెలుగు సినిమా ఒక్కటీ లేదు. ఇక నాగ్ మామ చెప్పాడని.. బిగ్ బాస్ కి హోస్ట్ గా ఓ ఎపిసోడ్ కి ట్రై చేసింది. సమంత, మామ నాగ్ అంత కాకపోయినా.. సమంత ఫస్ట్ టైం హోస్ట్ గా అలరించింది. బిగ్ బాస్ స్టేజ్ మీద యాంకరింగ్ చెయ్యడం, చూసిన అల్లు అరవింద్ ఆహా ఓటిటి ప్రమోషన్స్ కోసం సమంత తో సామ్ జామ్ అనే టాక్ షో ప్లాన్ చేసారు.

Advertisement
CJ Advs

నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత సెలబ్రిటీస్ తో టాక్ షో చేస్తుంది. ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఓ ఎపిసోడ్ కూడా పూర్తి చేసింది. ఆహా ఓటిటి నుండి సమంత టాక్ షో అనగానే అందరిలో భారీ అంచనాలు..  అందులోను విజయ్ దేవరకొండ గెస్ట్  అనగానే షో కాస్త డిఫ్రెంట్ గా ఉంటుందేమో... అనుకుంటే.... రొటీన్ టాక్ షో మాదిరి సామ్ జామ్ ఉండడంతో.. ప్రేక్షకుల పెదవి విరుపులు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. సమంత షో అంటే ఓ రేంజ్ లో ఊహించుకుంటే.. ఇక్కడేం కనిపించలేదంటున్నారు. ఇక ఈ షో కి హోస్ట్ చేసిన సమంత భారీ పారితోషకం అందుకుంది అంటే పొరబాటే.

సమంత రేంజ్ కి కోట్లలో పారితోషకం ఉంది అనుకుంటున్నారేమో...కానీ ఈ షో లో 10 ఎపిసోడ్స్ కి గాను సమంత మరీ చీప్ గా 1.5 కోట్లు అందుకుందట. మరి సమంత ఆహా కోసం తగ్గిందా.. లేదంటే తన రేంజ్ తగ్గింది అని ఒప్పుకుందా... లేదా అల్లు అరవింద్ కోసం చూసి చూడకుండా వదిలేసిందా.. అనేది ఇప్పుడు అభిమానుల ముందున్న పెద్ద ప్రశ్న.

Aha Samantha show disappointed:

No special in Aha Samantha Sam Jam Show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs