Advertisement
Google Ads BL

ప్రదీప్.. 30 రోజుల ప్రేమ కథ ఏమైంది!!


ప్రదీప్ మాచిరాజు యాంకర్ మాత్రమే కాదు. కొత్తగా హీరోగా కుడా ట్రై చేసాడు. ఢీ షో తోనూ, జీ తెలుగు షోస్ తో బిజిగా ఉండే ప్రదీప్ హీరో గా మరి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా చేసాడు. కరోనా రాకపోయుంటే ప్రదీప్ హీరోయిజం ఈపాటికి ప్రేక్షకులకు తెలిసేదే. కానీ కరోనా ప్రదీప్ ని నిండా ముంచేసింది. కరోనా టైం లో నాని, అనుష్క, సూర్య లాంటి స్టార్స్ అందరూ ఓటిటి అని ఫిక్స్ అయ్యి తమ సినిమాలని అమ్ముకున్న.. ప్రదీప్ 30 రోజుల ప్రేమ కథ మాత్రం ఓటిటి అమ్మలేదు. అలాగని థియేటర్స్ విడుదల డేట్ ఇవ్వడం లేదు. కనీసం ప్రమోషనూ లేదు.

Advertisement
CJ Advs

మొన్న దసరాకైనా క్లారిటీ ఏస్తరణనుకుంటే.. దసరాకి కామ్ గా ఉన్నారు. ఆఖరుకు దివాళీ రోజున కూడా పోస్టర్ లేదు.. ప్రకటనా లేదు. మరి ప్రదీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో బాగా పాపులర్ అయిన నీలి నీలి ఆకాశం మాత్రం అన్ని ఈవెంట్స్ లోను, అందరి మ్యూజిక్ ఆల్బమ్స్ లోను మోగుతుంది. ఆ సాంగ్ గనక పాపులర్ అవ్వకపోతే ప్రదీప్ ఓ సినిమా చేసాడనే విషయం ప్రేక్షకులు మర్చిపోయి చాలారోజులయ్యేది. కనీసం మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అనో.. లేదంటే వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల అనో ఏదో ఒక ప్రకటన ఇస్తే బావుండేది. కానీ ప్రదీప్ 30 రోజుల టీం మాత్రం కామ్ గా సైలెంట్ గా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రదీప్ 30 రోజుల ప్రేమకథకు ఏమైంది అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

Why this silence on 30 rojullo preminchadam ela?:

<span>When is 30 Rojullo Preminchadam Ela movie release?</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs