Advertisement
Google Ads BL

ఓటిటి వద్దు.. థియటర్స్ ముద్దు..?


నిన్నటివరకు కరోనా తో థియేటర్స్ బంద్.. నేడు థియేటర్స్ తెరిచినా 50 శాతం ఆక్యుపెన్సీ తో సినిమాలు రిలీజ్ చెయ్యడానికి హీరోలు ముందుకు రావడం లేదు.. బడ్జెట్ ప్రోబ్లెంస్ వలన నిర్మాతలు సినిమాలను ఓటిటీలకు అమ్ముకుంటున్నారు. అయితే సినిమాలు ఓటిటిలలో విదుడవుతున్న విషయం సగంమంది ప్రేక్షకులకు రీచ్ కావడం లేదు. అదే థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అయితే.. ప్రతి సినిమాకి ఓ రేంజ్ ప్రమోషన్స్ ఉండేవి. ఒకటి సినిమా ట్రైలర్ లాంచ్, రిలీజ్ ప్రెస్ మీట్, మరొకటి ప్రీ రిలీజ్ ఈవెంట్, మూడు ఆడియో వేడుక, నాలుగు హీరో, హీరోయిన్, దర్శకనిర్మాతల స్పెషల్ ఇంటర్వూస్ ఇంత తతంగం జరిగేది.. ప్రేక్షకులకు సినిమా విడుదల తేదీ.. సినిమా మీద అవగాహనా పెరిగేది.

Advertisement
CJ Advs

కానీ ఓటిటీలలో విడుదలయ్యే చాలా సినిమాలు అసలు ప్రమోషన్ లేకుండానే విడుదలవుతున్నాయి. తాజాగా విడుదలైన సూర్య ఆకాశం నీ హద్దురా విడుదలైన విషయం చాలామందికి తెలియదు. ఇక దీపావళి రోజున నయనతార అమ్మోరు తల్లి సినిమా విడుదలైన విషయం.. ఆ సినిమా రివ్యూ వచ్చేవరకు ప్రేక్షకుడికి తెలియని పరిస్థితి. అందరూ ట్విట్టర్, ఇన్స్టా లలో సినిమాల పబ్లిసిటీ చేస్తుంటే.. చాలామందికి ఆ విషయం చేరడం లేదు. బిసి సెంటర్ ప్రేక్షకుల మాట అటుంచి.. ప్రస్తుతం సిటీ గృహిణులకు ఆ సినిమాల విడుదల విషయం తెలియడం లేదు. 

ఓటిటీలు సినిమాలు కొనేసి నేరుగా రిలీజ్ చేసుకుంటే చాలదు.. ఆయా సినిమాల ప్రమోషన్స్ చాలా ముఖ్యం. కానీ ఓటిటీలు అవేం అపట్టించుకోవడం లేదు. హీరోలు కొంతమంది ఆన్ లైన్ పబ్లిసిటీ అంటున్నప్పటికీ.. చాలామందికి ఆ విషయం ఎక్కదు. అదే టివి లో ట్రైలర్ చూసినా, లేదంటే రిలీజ్ డేట్ ప్రోమోస్ అయినా ప్రేక్షకుడికి ఈజీగా రీచ్ అవుతాయి. కానీ ప్రస్తుతం ఓటిటీలు అవేం పట్టించుకోవడం లేదు. సినిమాలు కొన్నామా.. విడుదల చేశామా... అనే కాన్సప్ట్ మీదే ఉంటున్నారు. సరైన పబ్లిసిటీ లేక ఓటిటి రిలీజ్ ఆయన సినిమాలు ఎలా చతికల పడుతుంటే సినిమా జనాలు ఓటిటి వద్దు.. థియటర్స్ ముద్దు... అంటారేమో.!

OTT release movies but why no promotion?:

People are not knowing when the movies are getting released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs