Advertisement
Google Ads BL

పుష్ప రాజ్ ని ఢీ కొట్టబోయేది ఎవరంటే....?


పాన్ ఇండియా లెవల్లో సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో తాజాగా మొదలైన పుష్ప సినిమా షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో జరుగుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. పుష్ప లుక్ చూస్తుంటే అల్లు అర్జున్ మాస్ కాదు.. అంతకు మించి కనిపిస్తున్నాడు. అయితే తాజాగా మొదలైన ఈ సినిమాకి ఇంకా విలన్ ఎవరూ ఫిక్స్ కాలేదు. ముందుగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పుష్ప కోసం విలన్ గా అనుకుంటే.. విజయ్ డేట్స్ ప్రోబ్లెంస్ వలన తప్పుకున్నాక సుకుమర్ అప్పటినుండి పుష్ప రాజ్ ని ఢీ కొట్టే విలన్ వేటలో ఉన్నాడు. కానీ ఇంతవరకు పుష్ప విలన్ పై టీం క్లారిటీ ఇవ్వలేదు. గత వారంలో అల్లు అర్జున్ పుష్ప కోసం సుకుమార్ బాలీవుడ్ విలన్ ని సెట్ చేశాడన్నారు కానీ.. అదేమీ లేదు. తాజాగా పుష్ప విలన్ ని ఫైనల్ చేసినట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 

Advertisement
CJ Advs

అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ మాస్ పాత్రకి సరిపోవాలంటే విలన్ కూడా మాస్ గా ఉండాలా? లేదంటే స్టైలిష్ కనిపించాలా? అనే దాని మీద క్లారిటీ లేకపోయినా... అల్లు అర్జున్ కోసం ఓ బడా హీరో కాని, లేదంటే మరో బడా నటుడు కానీ విలన్ గా చేస్తే బావుంటుంది అనుకున్నారు. కానీ సుకుమార్ కి ఎవరూ నచ్చడం లేదు. బాలీవుడ్ నుండి పుష్ప రాజ్ విలన్ రాబోతున్నాడని అన్నారు. కానీ తాజాగా పుష్ప విలన్ గా అల్లు అర్జున్ వరుడు విలన్ నటించబోతున్నాడని అంటున్నాడు. వరుడు లో అల్లు అర్జున్ ని ఢీ కొట్టిన తమిళ హీరో ఆర్య ఇప్పుడు పుష్ప విలన్ గా కనిపిస్తాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఆర్య క్రేజ్ బాలీవుడ్ కి సరిపోతుందా? లేదా.. అని సుకుమార్ అండ్ టీం ఆలోచనలో ఉన్నట్లుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి..

Actor Arya Antagonist in Pushpa!:

Allu Arjun's Disaster Film's Villain Back for Pushpa!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs