Advertisement
Google Ads BL

ఆనందానికి.. నిరాశకి మధ్యన సూర్య?


తమిళ స్టార్ హీరో సూర్య హిట్ కొట్టి చాలాకాలం అయ్యింది. సింగం పార్ట్ 1, పార్ట్ 2 ల తర్వాత సూర్య కి మళ్ళీ విజయం దక్కలేదు. మధ్యలో గ్యాంగ్, బందోబస్త్ లాంటి సినిమాలతో సూర్య వరసగా ప్లాప్స్  కొట్టాడు. అయితే సూర్య - సుధా కొంగర దర్శకత్వంలో ఓ బయోపిక్ లో నటిస్తున్నాడు అనగానే అందరిలో ఆసక్తి ఉన్నా సినిమాపై అంచనాలు అంతగా లేవు. బయోపిక్ లపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉన్నా ట్రేడ్ లో అంచనాలు ఉండవు. సూర్య ఆకాశం నీ హద్దురా సినిమా పై అందరిలో పిచ్చ క్యూరియాసిటీ ఉంది. అయితే ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్స్ లో కాకుండా ఓటిటి లో  విడుదల చేసాడు సూర్య. ఆకాశం నీ హద్దురా సినిమాని థియేటర్స్ లో విడుదల చేస్తే ఆ మజానే వేరు. కానీ సూర్య థియేటర్స్ కోసం వేచి చూడకుండా ఓటిటికి అమ్మేశాడు.

Advertisement
CJ Advs

సూర్య ఫాన్స్ కి అది నచ్చలేదు. ఫాన్స్ ఆ సినిమాపై అంచనాలు పెట్టుకోవడమే కాదు.. హిట్ అవుతుంది అని నమ్మారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ పడడంతో సూర్య ఫాన్స్ గోల గోల చేస్తున్నారు. ఆకాశం నీ హద్దురా సినిమా గనక థియేటర్స్ లో విడుదలైతే బిసి సెంటర్స్ లో భారీ కలెక్షన్స్ వచ్చేవి.. అలాగే సూర్య ప్లాప్ లకు ఆకాశం నీ హద్దురా తో బ్రేక్ వేసేవాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లో విడుదల కావడంతో.. ఆ బ్లాక్ బస్టర్ టాక్ ని సూర్య ఫాన్స్ ఎంజాయ్ చెయ్యలేకపోతున్నారట. ఫాన్స్ మాత్రమేనా సూర్య కూడా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో హ్యాపీగా ఉన్నప్పటికీ.. చాల నిరాశలో ఉన్నట్లుగా కోలీవుడ్ మీడియాలో కథనాలు వెడుతున్నాయి.

ఓటిటి లో వచ్చిన టాక్ బట్టి సినిమా థియేటర్స్ లో అయితే దున్నేసేది.. కలెక్షన్స్ పరంగా లాభాలు మూటగట్టుకొనేవాడిని అని సూర్య ఇప్పుడు ఫీలవుతున్నట్లుగా టాక్. బొమ్మ థియేటర్స్ లో పడితే బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ లాభాలొచ్చేవి అని సూర్య ఫీలింగ్ అంటున్నారు. కానీ ఇప్పుడు ఆకాశం నీ హద్దురా హిట్ అయినందుకు హ్యాపీ గా ఉండాలో.. లేదా థియేటర్స్ లో విడుదల కానందుకు బాధపడాలో సూర్యకే అర్ధం కానీ పరిస్థితి.

Aakaasam nee haddu raa a hit but, will this make suriya happy?:

Suriya in the midst of happiness and despair
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs