బిగ్ బాస్ సీజన్ 4 టాప్ 5 కంటెస్టెంట్స్ పై ప్రేక్షకులకు ఓ అవగాహన ఉంది.. ప్రస్తుతం అందరూ స్ట్రాంగ్ గానే కనబడుతున్నా బిగ్ బాస్ గేమ్ లో ఎవరు టాప్ 5 లో ఉండబోతున్నారో ఓ క్లారిటీ అయితే వచ్చింది. అభిజిత్, అఖిల్, సోహైల్, అవినాష్, లాస్య లు టాప్ ఫైవ్ లో ఉండే ఛాన్స్ ఉండగా.. ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ విషయంలోనూ చాలామందికి ఓ క్లారిటీ వచ్చేసిందని అంటున్నారు. హౌస్ లో మొదటి రెండు వారాల్లో స్నేహం చేసిన అభిజిత్ - అఖిల్ మధ్యలో మోనాల్ విషయంలో గొడవపడి నాలుగైదు వరాల వరకు ఎడ మొహం పెడ మొహంగానే ఉన్నారు. కానీ గత రెండు వారాలుగా వీరిద్దరూ స్నేహం చేస్తుంటే.. అఖిల్, అభిజిత్ ని నామినేట్ చేసి షాకివ్వడంతో అభిజిత్ - అఖిల్ మధ్య మల్లి పోరు మొదలైంది.
ఇక గత రాత్రి బిగ్ బాస్ హౌస్ లో ఎవరు స్ట్రాంగ్.. వారిని హౌసెమెట్స్ అంటా ఏకాభిప్రాయంతో బయటిక్ పంపమంటే.. అందులో అభిజిత్ సెల్ఫ్ గేమ్ ఆడగా.. లాస్య, హరికలు ఫ్రెండ్స్ ని బయటికి పంపలేము అనేసారు. అరియనా అఖిల్ స్ట్రాంగ్ అంటే.. మోనాల్ కూడా అఖిల్ స్ట్రాంగ్ అంది. ఇక మెహబూబ్ అఖిల్ పేరు చెప్పడంతో.. మెజారిటీ ఓట్స్ తో అఖిల్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చేసాడు. అక్కడినుండి అఖిల్ ని నేరుగా సీక్రెట్ రూమ్ కి పంపగా.. అఖిల్ ని రెస్ట్ తీసుకోమన్న బిగ్ బాస్ తన అట మొదలెట్టాడు. హౌస్ లో అభిజిత్, అఖిల్ ని అన్నమాటలను అఖిల్ కి చూపిస్తూ మళ్ళీ ఆజ్యం పోసాడు. అభిజిత్ చెప్పినా పాయింట్స్ కరెక్ట్ కానీ.. అఖిల్ దాన్ని ఒప్పుకోవడం లేదు.
సరే ఇప్పుడు అఖిల్ సీక్రెట్ రూమ్ కి వెళ్లాడంటే ఖచ్చికంగా అతనే బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గత సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ ఇలానే సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి ఫైనల్ గా విన్నర్ అయినట్లుగానే ఈసారి సీక్రెట్ రూమ్ కి వెళ్లిన అఖిల్ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అవ్వొచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. మరి టాస్క్ ల పరంగా అఖిల్ స్ట్రాంగ్. మైండ్ గేమ్ పరంగా అభిజిత్ స్ట్రాంగ్. కానీ ఇప్పుడు టాప్ 5 నుండి విన్నర్ అయ్యే ఛాన్సెస్ అఖిల్ కి ఎక్కువ ఉన్నాయంటున్నారు.