Advertisement
Google Ads BL

ప్రేమలో ఉన్నాం.. పెళ్లి మాత్రం ఇప్పుడు కాదు!!


చిన్నారి పెళ్ళి కూతురుగా బాలీవుడ్ సీరియల్స్ లో హడావిడి చేసిన అవికా గోర్.. తర్వాత టాలీవుడ్ సినిమాలతో బాగా ఫేమస్ అయ్యింది. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మావా, లక్ష్మి రావే మా ఇంటికి, రాజుగారి గది 3 సినిమాలతో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అవికా ఉన్నట్టుండి మాయమైపోయింది. అయితే అవికా గోర్ మాయమవడానికి అవకాశాలు తగ్గడం ఓ కారణమైతే.. మరొక కారణం ఆమె బాగా బరువు పెరగడం. ఆ విషయం స్వయానా అవికానే చెప్పుకొచ్చింది. ఏడాదిగా గ్లామర్ ఫొటోస్, ఆమె సన్నబడిన ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న అవికా గోర్.. తాను సన్నబడడానికి గల కారణాలు చెప్పింది. అయితే తాజాగా అవికా ఇచ్చిన షాక్‌కి ఆమె ఎందుకు సన్నబడిందో ఇప్పుడు క్లారిటీ వచ్చింది అంటున్నారు నెటిజెన్స్.. బాలీవుడ్ సీరియల్స్ లో నటిస్తున్నప్పుడే సీరియల్ నటుడితో ప్రేమాయణం నడిపిన అవికా ఆ లవ్ బ్రేకప్ అయ్యాక సినిమాలతో బిజీ అయ్యింది.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు అవికా గోర్ కొత్త బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. అవికా, మిలింద్ ఛద్వాని ప్రేమలో ఉన్నట్లుగా చెప్పడమే కాదు.. తన బాయ్ ఫ్రెండ్ తో తాను దిగిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎప్పుడూ దేవుడిని ప్రార్ధించే నాకు.. ఇప్పుడు ఆ ప్రార్ధనలకు సమాధానం దొరికింది. నా జీవితంలో ప్రేమ దొరికింది. మనల్ని నమ్మి, ఎంతో స్ఫూర్తినిచ్చే వ్యక్తులు మనకు దొరకడం అదృష్టం. మనల్ని జాగ్రత్తగా చూసుకునే జీవిత భాగస్వామి దొరకడం చాలా అరుదు. ఒక్కోసారి అసాధ్యం. అందుకే నాకు దొరికిన ఈ అదృష్టం ఇంకా కలలాగే ఉంది. కానీ ఇది నిజం.

నాకు దొరికిన ఈ బంధం నా జీవితంలో కీలక పాత్ర పోషించబోతుంది. ఈ బంధాన్ని నాకు ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు అంటుంది. ఈ ఇడియట్ నన్ను ప్రేమించడానికే పుట్టాడు. నన్ను సంతోషంగా ఉంచేందుకే వచ్చాడు. ప్రస్తుతం మిలింద్ నేను ప్రేమలో ఉన్నాం.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదంటూనే మిలింద్ ఛద్వాని తన జీవితాన్ని పరిపూర్ణం చేసినందుకు తెగ థాంక్స్ చెప్పేస్తుంది. మరి అవికా గోర్ బాయ్ ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని దిగిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. 

Avika Gor has found the love of her life:

Avika gor introduces Her Boyfriend
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs