Advertisement
Google Ads BL

దివి సూపర్.. అభిజిత్ వేస్ట్ అంటోన్న ఎలిమినేటర్‌!


ఈమాటన్నది ఎవరో కాదు.. గత వారం ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికొచ్చిన అమ్మ రాజశేఖర్ మాస్టర్. కెప్టెన్సీ కెప్టెన్సీ అంటూ ఆరాటపడిన మాస్టర్ కి.. కెప్టెన్సీ వచ్చేసరికి ఇంటి బయట ఉండాల్సి వచ్చింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన అమ్మ రాజశేఖర్ ని బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ చెయ్యగా అందులో అమ్మ రాజశేఖర్ ఓపెన్ అయ్యాడు. ఈమధ్యన బిగ్ బాస్ హౌస్ లో అభిజిత్ - అమ్మ రాజశేఖర్ లు నువ్వా - నేనా అన్నట్టుగా ఉండడం, అభిజిత్ ని ఇబ్బందులు పెట్టాలనే విషయంలో మాస్టర్ ప్లాన్ చేసినా.. ఎలిమినేషన్ నుండి తప్పించుకోలేకపోయాడు. అయితే బయటికొచ్చాక తన అక్కసుని వెళ్లగక్కాడు అమ్మ.

Advertisement
CJ Advs

అభిజిత్ అసలు బిగ్ బాస్ కి అనర్హుడని.. బిగ్ బాస్ లో ఉండాల్సిన వ్యక్తి కాదని.. ఇన్ని రోజులు అభిజిత్ హౌస్ లో ఉండడం షాకింగ్ విషయమే అంటున్నాడు. ఫిజికల్ గా ఫిట్ కాని అభిజిత్ హౌస్ కి అసలు ఏ విధంగానూ సూట్ కాదనేశాడు. నేను మళ్లీ అవకాశం వచ్చి హౌస్ లోకి వెళితే అది అభిజిత్ ఎలిమినేట్ అయ్యాకే అంటూ షాకింగ్ గా మాట్లాడాడు. ఇక దివి గురించి మాట్లాడిన అమ్మ రాజశేఖర్ దివి తనని హౌస్ లోను, బయట బ్యాడ్ కాకుండా కాపాడిన అమ్మాయి.. చాలా మంచి అమ్మాయి దివి అంటూ కితాబునిచ్చేశాడు. అలాగే అఖిల్ ఎలిమినేషన్స్ కి సంబంధించిన నామినేషన్స్ ని సిల్లీగా మార్చేశాడని.. అఖిల్ సిల్లీగా నామినేట్ చేస్తాడంటూ.. ఫైర్ అయ్యాడు.

ఇక నోయెల్ కూడా అవినాష్ ని చిల్లర కామెడీ అనకుండా ఉండాల్సింది.. వాడికి కామెడీనే జీవితం అన్న అమ్మ కి రాహుల్ కూడా పంచ్ వేసాడు. చిల్లర కామెడీ అన్నది అవినాష్ ని కాదు... మిమ్మల్ని కదా.. అయినా అవినాష్ నోయెల్ విషయంలో అంత ఎమోషనల్ గా అరుస్తుంటే మీరెందుకు ఆపలేదంటూ పంచ్ తగిలించాడు.

Amma Rajasekhar Shocking comments on Abhijith:

Divi Super.. Abhijith Waste Says Amma Rajasekhar in an Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs