Advertisement
Google Ads BL

టీఆరెస్ కి ఎదురు గాలి.. దుబ్బాక బీజేపీ కైవసం!!


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆరెస్ కి ఎదురు లేదు. తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పటినుండి.. టిఆర్ఎస్ కి ఎదురు లేకుండా పోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ.. ఉన్నాయంటే ఉన్నాయన్నట్టుగా ఉండేవి. అసలు ప్రధాన ప్రతి పక్షమే లేదు అన్నట్టుగా టీఆరెస్ తెలంగాణాలో జెండా పాతేసింది. కానీ ఇప్పుడు టిఆర్ఎస్ కి తెలంగాణాలో ఎదురు గాలు వీచడం దుబ్బాక నుండి స్టార్ట్ అయ్యింది అనిపిస్తుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆరెస్ ని ఓడించి బీజేపీ జెండా పాతింది. ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. నేడు దుబ్బాక ఎన్నికల కౌంటింగ్ లో నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. 

Advertisement
CJ Advs

నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్‌ఎస్‌ కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది. 1470 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్‌ విజయం సాధించారు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఎంత హాట్ గా ఉందొ.. అంతే హాట్ గా.. ఈ దుబ్బాక ఉప ఎన్నిక సాగింది. టీ-20 మ్యాచ్‌లా సాగిన పోరులో మొదటి పది రౌండ్స్‌లో బీజేపీ పూర్తిస్థాయి ఆధిక్యం కనబర్చగా మధ్యలో అనుహ్యంగా పుంజుకున్న టీఆర్‌ఎస్‌ 11 నుంచి 20 రౌండ్‌ వరకు ఆధిక్యంలోకి దూసుకొచ్చి బీజేపీకి సవాలు విసిరింది. ఓ సమయంలో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమనే రీతిలో ఆధిక్యం కనబర్చింది. అయితే 20 వ రౌండ్ తర్వాత బీజేపీ పడిలేచిన కెరటంలా చివరి నాలుగు రౌండ్స్‌లో లీడ్‌లోకి వచ్చి.. చివరకి ఉత్కంఠకు తెరదించింది. వరుసగా 20,21,22,23 రౌండ్స్‌లో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చి.. సంచలన విజయాన్ని నమోదు చేసింది. 

కేసీఆర్ టిఆర్ఎస్ గెలిస్తే తన ఆనందాన్ని పంచుకునేవారు. కానీ ఈ అనూహ్య పరిణామం వలన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి టీఆరెస్ నాయకులకు దుబ్బాక ఉప ఎన్నిక ఒక హెచ్చరిక లాంటిది. దాని నుండి పాటలు నేర్చుకుని ముందుకు సాగుతాం. మేము విజయాలకు ఉప్పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము అంటూ తమ ఓటమిని అంగీకరించారు.ఇక దుబ్బాకలో రఘునందన్  విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

BJP Wins Dubbaka Seat:

BJP Wins Dubbaka By 1470 Votes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs