బిగ్ బాస్ సీజన్ 4 మొదలై తొమ్మిది వారలు గడిచిపోయింది. ఇలాంటి టైమ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒకరు నన్ను ఇంటికి పంపేయండి అంటూ బిగ్ బాస్ ని వేడుకుంటుంది. ఆమె ఎవరో కాదు.. బిగ్ బాస్ సీజన్ 4 లో నేను తోపు, నేను తురుము.. నేను బిగ్ బాస్ ఇచ్చిన ఆట ఆడుతున్న.. మనం ఇక్కడ ఆడడానికి వచ్చాము కానీ.. క్లోజ్ గా ఉండడానికి... టాస్క్ లను అవాయిడ్ చెయ్యడానికి కాదు అంటూ రెండు వారాలుగా కాదు... కాదు.... బిగ్ బాస్ స్టార్టింగ్ నుండి అతి చేస్తున్న అరియనా.. ఇప్పుడు బిగ్ బాస్ నుండి వెళ్ళిపోతా.. బయటికి పంపేయండి అంటూ ఎమోషనల్ గా ఏడుపు స్టార్ట్ చేసింది. ఆదివారం ఎపిసోడ్ లో అవినాష్ తో నువ్వు వెళ్ళిపోతే ఏం చేసుకోకు అంటూ మాట తీసుకున్న అరియనాకి క్లోజ్ అయిన అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఎలిమినేట్ అవడంతో.. అరియనా ఇప్పుడు రెక్కలు తెగిన పక్షిలామారిపోయింది.
అమ్మ రాజశేఖర్ అరియానాని బాగా సపోర్ట్ చేస్తూ తనకి అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు. మరి అరియానాని సపోర్ట్ చేసే వాళ్ళు వెళిపోతే ఏడవక ఏం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హౌస్ లో ఉన్నవాళ్లు అందరూ అరియనా అతికి యాంటీ కాబట్టి. ఇక కెమెరా దగ్గరకి వచ్చి బిగ్ బాస్ నేను ఒంటరిదానిని అయిపోయా.. నేను ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉండలేను. నన్ను ఇంటికి పంపించేయండి. నేను బోల్డ్ కాదు.. అవన్నీ వెనక్కి తీసుకోండి.. ఈ ఇంటి సభ్యుల మధ్యన నేను ఉండలేను అంటూ ఏడుపు స్టార్ట్ చేసింది. నేను ధైర్యం గల అమ్మాయిని కాదు.. నేను చాలా ఎమోషనల్... అమ్మా గారిని బయటికి పంపి ఒంటరిని చేసేశావ్ అంటూ అరియనా కెమెరా ముందు బిగ్ బాస్‌కి చెప్పుకుని ఏడ్చేసింది.