Advertisement
Google Ads BL

చిరుకి పాజిటివ్‌.. పెరుగుతోన్న టెన్షన్‌..!


మెగా స్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ లో అడుగుపెట్టకముందే కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. చిరు కి కరోనా పాజిటివ్ రాగా... ఆయన హోమ్ క్వారంటైన్ కి వెళ్లిపోవడమే కాదు... నాకు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వచ్చింది. అందుకే మీరు అంటే నాతో గత నాలుగైదు రోజులుగా కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోండి అంటూ ట్వీటాడు. దానితో చిరంజీవి ని గత నాలుగైదు రోజులుగా కలిసిన వారంతా ఇప్పుడు ఉలిక్కి పడ్డారు. అందులో ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారు. చిరంజీవి, నాగార్జున తో కలిసి రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ ని కలిసారు. అందులోను చిరు ఎలాంటి మాస్క్ ధరించనైననూ లేదు. 

Advertisement
CJ Advs

మరి చిరు కి ఎవరి నుండి కరోనా సోకిందో కానీ... ఇప్పుడు చిరు ని కలిసిన నాగ్ - కేసీఆర్ ఇంకా తెలంగాణ మంత్రి కూడా కరోనా టెస్ట్ కోసం వెళ్లాల్సిన పరిస్థితి. అంతేనా నాగార్జునని కలిసిన వారు కూడా ఇప్పుడు కంగారు పడుతున్నారని టాక్. ఇప్పటికే సీఎం క్యాంపు ఆఫీస్ అధికారులు కరోనా  టెస్టులు కోసం పరిగెట్టారని.. అందులో ఒక మంత్రి గారికి నెగెటివ్ కూడా =వచ్చినట్లుగా  తెలుస్తుంది. ఇక నాగార్జున లేటెస్ట్ గా బిగ్ బాస్ షో లో యాంకర్ సుమ తో యాంకరింగ్ చేసాడు. దానితో సుమ కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నట్లుగా సమాచారం. మరి చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తెలియగానే.. అందరూ చిరు త్వరగా కోలుకోవాలంటూ దేవుణ్ణి కోరుకుంటుంటే.. చిరుని కలిసిన ప్రముఖులు మాత్రం కరోనా టెస్ట్ ల కోసం పరిగెత్తాల్సి వస్తుంది.

Chiranjeevi Tests Corona Positive.. Tension in everywhere:

Tension starts at Bigg Boss and Pragathi Bhavan.. with Positive report to Chiru
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs