Advertisement
Google Ads BL

అరియనా అతి.. అవినాష్ సింపతీ?


బిగ్ బాస్ సీజన్ 4 లో తొమ్మిది వారలు పూర్తి కాగా.. మిగతా ఐదు వారాలకు గాను అవినాష్, అరియనా, అభిజిత్, అఖిల్, మోనాల్, మెహబూబ్, సోహైల్, హారిక, లాస్య లు మిగిలారు. నిన్న సండే ఎపిసోడ్ లో అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఎలిమినేట్ అవగా.. ఇంకా తొమ్మిదిమంది హౌస్ లో ఉన్నారు. అందులో అభిజిత్ టాస్క్ పరంగా పెరఫార్మెన్స్ లో వీక్. అఖిల్ మోనాల్ నుండి తప్పించుకుని తిరుగుతూ ఇప్పుడే గేమ్ మీద ఫోకస్ పెట్టాడు. హరిక కూడా గేమ్ ని మంచిగా ఆడుతుంది. మెహబూబ్ అయితే బిగ్ బాస్ కోసమే పుట్టా అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు.. సోహైల్ పర్లేదు. లాస్య ఫిజికల్ గా కాకపోయినా... నవ్వుతోనే అందరిని కలుపుకుపోతుంది. ఇక జబర్దస్త్ నుండి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన అవినాష్ మాట్లాడితే సింపతీ కార్డ్ వాడుతున్నాడు. 

Advertisement
CJ Advs

బిగ్ బాసే దిక్కు.. బయటికి వెళితే నాకు జబర్దస్త్ ఎంట్రీ లేదు.. వాళ్ళు మళ్ళీ తీసుకోమని చెప్పారని మాట్లాడుతూ సింపతీ వర్కౌట్ అయ్యేలా చూసుకుంటున్నాడు. ఇక అరియనా అతి రెండు వారాలుగా భరించడం కష్టంగా మారింది. టీ స్టాండ్ టాస్క్ లో బాగా అతి చేసిన అరియనా ఆదివారం ఎపిసోడ్ లో మరింత ఎక్కువ చేసింది. అవినాష్ - అమ్మ రాజశేఖర్ ఇద్దరూ ఎలిమినేషన్ ప్రక్రియలో రెండు రూమ్స్ లోకి పంపాలని.. నాగార్జున చెప్పగా.. అవినాష్ ఎక్కడ ఎలిమినేట్ అవుతాడో అని అనుకున్న అరియనా అవినాష్ దగ్గరికి వచ్చి అవినాష్ నువ్వు ఎలిమినేట్ అయినా ఏం(సూయిసైడ్ లాంటిది) చేసుకోకు. ఈ షో కాకపోతే ఏదో ఒక షో వస్తుంది. నువ్వైతే బ్రతికుండాలి.. నాకు ప్రామిస్ చెయ్యి అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం మాత్రం కాస్త చిరాకు తెపించింది.

అవినాష్ బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయితే బయటకెళ్ళాక సూయిసైడ్ చేసుకుంటాడని అరియనా ఫీలింగ్. అంటే బిగ్ బాస్ లేకపోతె లైఫ్ లేదా.. అవినాష్ అంత వీకా? ఏమో అరియనకు అవినాష్ గురించి ఏం తెలుసో కానీ... పిల్ల మాత్రం బిగ్ బాస్ లో ఓవరేక్షన్ మాములుగా చెయ్యడం లేదు. ఇక అవినాష్ అయితే సేవ్ అయ్యానని కూడా లేకుండా బిగ్గరగా ఏడుస్తూ కళ్ళలో ఒణుకు వచ్చింది, వెన్నులో ఒణుకు పుట్టింది అంటూ సింపతీ మీదే గేమ్ ఆడుతున్నాడు.

Bigg Boss: Ariyana Overaction.. Avinash eye on Sympathy:

Bigg Boss Contestants situation in House
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs