Advertisement
Google Ads BL

చిరుకి కరోనా పాజిటివ్.. మరి కేసీఆర్, నాగ్?


కొరటాల - చిరు కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య షూటింగ్ కరోనా కారణంగా పోస్ట్ పోన్ అయ్యింది. అయితే తాజాగా నవంబర్ 9 నుండి ఆచార్య రీ షూటింగ్ ప్రారంభించబోతున్నట్టుగా ఆచార్య టీం ప్రకటించింది. చిరు తో పాటుగా ఆచార్య సినిమాలో కీలక నటీనటులతో 45 రోజుల భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నాడు కొరటాల. కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి, హాని మూన్ ముగించుకుని ఆచార్య సెట్స్ లో అడుగుపెడుతుంది అన్నారు. మరి కొరటాల శివ ఏకధాటిగా లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసి నేడు రంగంలోకి దిగే టైం లో ఆచార్య టీం మొత్తం కరోనా టెస్ట్ లు చేయించుకోగా.. అందులో చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడంతో.. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయినట్లుగా చిరు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసారు.

Advertisement
CJ Advs

ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే  హోమ్  క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను... అంటూ చిరు ట్వీట్ చెయ్యడం తో మెగా అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే చిరు కి ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేకపోయినా కరోనా సోకిన కారణంగా ఆయన హోమ్ క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

కానీ ఇప్పుడు మరో ప్రధాన సమస్య ఏంటి అంటే.. చిరంజీవి వరద బాధితుల సహాయార్ధం ప్రకటించిన విరాళాల చెక్ అందచేసేందుకు.. చిరు, నాగార్జున తో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ ని మీట్ అవ్వడం జరిగింది. మరి చిరు కి కరోనా పాజిటివ్ రావడంతో.. ఇప్పుడు నాగ్, కేసీఆర్ లు పరిస్థితి ఏమిటో అంటున్నారు. ఇక చిరు - కొరటాల ఆచార్య షూటింగ్ నేడు ప్రారంభించి.. వేసవిలో సినిమా విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ చిరు కి కరోనా సోకడంతో ఆచార్య వాయిదా పడినట్లే... అలాగే విడుదల విషయంలోనూ మార్పులు జరిగే ఛాన్స్ లేకపోలేదు.

Chiranjeevi Corona Positive, Met KCR Along With Nagarjuna:

Chiranjeevi Tests Corona Positive, Home Quarantined
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs