Advertisement
Google Ads BL

ప్రేక్షకులను ఫూల్స్ చేసిన బిగ్ బాస్?


బిగ్ బాస్ అంటేనే టిస్టులు. బిగ్ బాస్ లో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించనైననూ లేరు. ఓకె కానీ శనివారం, ఆదివారం బిగ్ బాస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో అనేది సోషల్ మీడియాలో గత మూడు సీజన్స్ గా లీకులు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులను ఫూల్స్ చేసాడు. అది సుమ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపిస్తున్నామంటూ  ప్రోమోస్ వదిలాడమే కాదు... తాజాగా ఎపిసోడ్ లో నాగార్జున తో పాటుగా బిగ్ బాస్ స్టేజ్ మీద యాంకర్ సుమ ని నిలబెట్టి హౌస్ మేట్స్ ని సర్ప్రైజ్ చేసారు.

Advertisement
CJ Advs

ఇక సుమ స్టేజ్ మీదకి అడుగుపెట్టినప్పటినుండి వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ ఊరిస్తూనే హౌస్ మేట్స్ ని ఓ ఆటాడించింది. సుమ పంచెస్ ని  చేసిన అల్లరికి నాగ్ అలా చూస్తుండిపోయాడంతే. మధ్యలో నాగ్ పంచ్ లకి సుమ డంగ్ అయ్యింది. అవినాష్ నా చిన్నప్పటినుండి మీ యాంకరింగ్ చూస్తున్నా అనగానే నాగార్జున నీ చిన్నప్పుడేమిటి నా చిన్నప్పటినుండి సుమ యాంకరింగ్ చూస్తున్నా అంటూ వేసిన పంచ్ బాగా పేలింది. ఇక సుమ పేరు పేరునా హౌస్ లో వాళ్లెలా ఉంటున్నారో చెప్పి అందరికి షాకిచ్చింది. మధ్య మధ్యలో హౌస్ లోకి వస్తున్నా ఆగండి అంటూ ఊరించడం, నాగార్జున దివాళి ఫెస్టివల్ సందర్భంగా సుమ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తుంది అంటూ హౌస్ లోకి పంపుతున్నట్టే పంపి మళ్ళి సుమని స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు.

మరి సుమ బిజీ షెడ్యూల్స్ కి ఆమె బిగ్ బాస్ కి వెళ్ళదని.. సినీ జోష్ ఇంతకుముందే రివీల్ చేసింది. సిని జోష్ చెప్పిట్టుగానే సుమ తన మేనేజర్ ఫోన్ చేసాడు అంటూ నాకు టైం లేదు అని అందరికి బై బై చెప్పేసి స్టేజ్ దిగేసి వెళ్ళిపోయింది. మరి నిజంగానే సుమ వైల్డ్ కార్డు ఎంట్రీ అని బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూస్తుంటే బిగ్ బాస్ మాత్రం ప్రేక్షకులను ఫూల్స్ చేసి సుమ క్రేజ్ ని నేటి ఎపిసోడ్ కి వాడేసింది.

Suma Wild Card Entry: Bigg Boss Game with Audience:

Bigg Boss brings in Suma to save Ratings
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs