Advertisement
Google Ads BL

లవ్ స్టోరీనే అంటే ప్రభాస్ ఫిల్మ్ వారికి ఎక్కుతుందా?


 

Advertisement
CJ Advs

బాలీవుడ్ ప్రేక్షకులకు యాక్షన్ అంటే ఎంతిష్టమో చాలా యాక్షన్ సినిమాలకు అక్కడ వచ్చిన కలెక్షన్స్ బట్టి అర్ధమవుతుంది. యాక్షన్ ఉంటే ఆ సినిమా హిట్ అనేది సాహో టైమ్ లోను చూశాం. ప్రభాస్ సాహో సినిమాలో యాక్షన్ ఎక్కువవడంతో.. సౌత్ ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తే బాలీవుడ్ ప్రేక్షకులు సాహో యాక్షన్‌కి పడిపోయారు. అంతగా యాక్షన్ ఇష్టపడే బాలీవుడ్ ప్రేక్షకులకు యాక్షన్ ఉండదు.. కేవలం లవ్ స్టోరీ ఉంటుంది అంటే ఆ సినిమా బాలీవుడ్‌లో హిట్ కావడం కష్టమేమో అంటున్నారు. మరి అది ఏదో సినిమా కాదు.. ప్రభాస్ - పూజా హెగ్డే కాంబోలో రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ సినిమానే.

రాధేశ్యామ్ సినిమా మొదలైనప్పటి నుండి ఈ సినిమా లవ్ స్టోరీగానే ప్రచారం జరగడం, విడుదలైన రాధేశ్యామ్ లుక్స్ చూసిన రాధేశ్యామ్ లవ్ స్టోరీ అని చెప్పడానికి ప్రూఫ్ లు ఉండడమే కాదు... తాజాగా ప్రభాస్ కూడా రాధేశ్యామ్ పూర్తి ప్రేమ కథా చిత్రం అంటున్నాడు. మరి పాన్ ఇండియా లెవెల్ అంటే కేవలం లవ్ స్టోరీతో నడిపించడం కష్టం.. తగిన యాక్షన్ కూడా ఉండాలి. అందులోనూ ప్రభాస్ యాక్షన్ ఇష్టపడే ప్రేక్షకులు కోకొల్లలు. అలాంటిది కేవలం సినిమా మొత్తం ప్రేమ చుట్టూ తిరగడమనేది ఒప్పుకోరేమో. మరి రాధేశ్యామ్ అనేది స్వచ్ఛమైన ప్రేమ కథా చిత్రమని... కేవలం ఒక్క యాక్షన్ ఎపిసోడ్ తప్ప సినిమాలో... మిగతాదంతా ప్రేమ చుట్టూనే తిరుగుతుంది అని ప్రభాస్ చెప్పడంతో.. రాధేశ్యామ్ కథపై అందరికి ఓ క్లారిటీ అయితే వచ్చింది... కానీ యాక్షన్ ఇష్టపడే బాలీవుడ్ ప్రేక్షకుల మాటే అర్థం కావడం లేదు.

Prabhas gives Clarity about RadheShyam Movie:

Is Bollywood audicend accepted RadheShyam Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs