Advertisement
Google Ads BL

నితిన్ హిట్ సినిమాకి షాకింగ్ టీఆర్పీ


థియేటర్స్ మూత బడడంతో ఓటిటి సంస్థలు ఓ రేంజ్ క్రేజ్ తో పైపైకి వెళ్లిపోయాయి. గతంలో సినిమా థియేటర్స్ లో విడుదలవ్వాలి.. ఓ నెల, రెండు నెలల వరకు ప్రేక్షకుడికి ఓటిటిలో సినిమా దొరికేది కాదు.. ఈలోపు ఓటిటి మీద ప్రేక్షకుడు అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. అలాగే ఆ సినిమా శాటిలైట్ హక్కుల కింద అమ్మేస్తే.. ఆయా ఛానల్ లో సినిమా ప్రసారం అయినప్పుడు ఇంటిల్లిపాది ఆ సినిమాని వీక్షించేవారు కానీ... పెద్దగా ఓటిటిని ఎంకరేజ్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు థియేటర్స్ బంద్.. అందుకే ఓటిటీలతో బేరాలు కుదుర్చుకుంటున్న సినిమాలు ఓటిటి డేట్ రోజున విడుదల కావడంతో ఇంటిల్లిపాది ఆ సినిమాని ఓటిటిలో చూసేస్తున్నారు. ఇక ఆ సినిమా శాటిలైట్ హక్కులను కొన్న ఛానల్ లో ప్రసారం చేసినా ఆ సినిమాకి హిట్ టీఆర్పీ రావడం లేదు.

Advertisement
CJ Advs

మరి తాజాగా నితిన్ భీష్మ సినిమా ఓటిటి దెబ్బకి శాటిలైట్ హక్కులు కొన్న ఛానల్ కి దారుణమైన టీఆర్పీ మూటగట్టుకుంది. నితిన్ - రష్మిక భీష్మ సినిమా కరోనా కన్నా ముందు థియేటర్స్ లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక డిజిటల్ హక్కులు కొన్న ఓటిటి భీష్మని ఏప్రిల్ 27 న స్ట్రీమింగ్ చేసేసింది. లాక్ డౌన్ లో థియేటర్స్ లేకపోవడం, సినిమాలు లేకపోవడంతో చాలావరకు ఓటిటిలోనే భీష్మ చూసేశారు. మరి అప్పటినుండి గత వారం వరకు భీష్మ శాటిలైట్ హక్కులు దక్కించుకున్న జెమిని వారు ఆ సినిమాని ప్రసారం చెయ్యలేదు. అయితే భీష్మ సినిమాని దసరా రోజున జెమినిలో ప్రసారం చెయ్యగా ఆ సినిమాకి దారుణమైన టీఆర్పీ రేటింగ్ వచ్చింది. హిట్ సినిమాకి అంత తక్కువ టీఆర్పీ రావడం చూస్తే ఓటిటి హవా ఎలా నడుస్తుందో ఆర్ధమవుతుంది. మరి ఇలానే థియేటర్స్ బ్యాండ్ కొనసాగుతూ ఓటిటీల హవా ఉంటే.. సినిమాల శాటిలైట్ హక్కుల పని గోవిందా అనేలా ఉంది.

Shocking TRP to Nithiin Hit Film Bheeshma:

Nithiin Bheeshma Telecasted on Small Screen  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs