Advertisement
Google Ads BL

కీర్తి సురేష్ ఎవరితో కమిట్ అయ్యిందంటే?


ఈమధ్యన లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కుంటున్న కీర్తి సురేష్.. లాక్ డౌన్ లో రెండు సినిమాలను ఓటిటిలో విడుదల చేసింది. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. తాను లాక్ డౌన్ లో చిన్న చిన్న విషయాల్లో సంతోషం వెతకడం నేర్చుకున్నా అంటుంది కీర్తి సురేష్. ఇక అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చింది కీర్తి సురేష్. మీ కెరీర్ లో మీకు నచ్చే విషయం ఏమిటి అంటే.. తనకి ప్రయోగాలు చెయ్యడం అంటే ఇష్టం అని.. అలాగే అభిమానులు తనపై చూపించే అభిమానం అంటే చాలా ఇష్టం అంటుంది. అంతేకాకుండా అభిమానులు తన ఫ్యామిలీ మెంబెర్స్ అంటుంది కీర్తి సురేష్.

Advertisement
CJ Advs

ఇక సమంత గురించి ఒక్క మాటలో చెప్పండి అనగానే.. సమంత గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కుదరదని.. సమంత చాలా స్మార్ట్ అని.. ప్రయోగాలు చేస్తుండడం తనకెంతో నచ్చుతుంది అని చెబుతుంది. కీర్తి సురేష్ కి ఒత్తిడి అనిపించినప్పుడు డ్రైవింగ్ చెయ్యడమే కాదు.. తన పెంపుడు కుక్క నైక్ తో టైం స్పెండ్ చేస్తూ చాయ్ తాగుతుంటాను అంటుంది. ఇక సర్కారు వారి పాటలో అవకాశం రావడం ఎగ్జైటింగ్ గా ఉందని... ఆ సినిమాలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంటా అంటుంది కీర్తి సురేష్. పాన్ ఇండియా మూవీలో కూడా త్వరలోనే నటించే ఛాన్స్ ఉంది అంటూ కీర్తి అభిమానులను సస్పెన్స్ లో పెట్టింది. ఇక మీరు సింగిలా.. కమిటెడ్ అని అడగగానే.. నేను కెరీర్ తో కమిట్ అయ్యా అంటూ నవ్వేసింది.

Keerthi Suresh Latest Interview Updates:

Keerthi Suresh Chit Chat With Media From Miss India Pramotion
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs