Advertisement
Google Ads BL

పవన్ జాయిన్ అయ్యే తదుపరి చిత్రమిదే!


కరోనా కారణంగా వాయిదా పడిన వకీల్ సాబ్ షూటింగ్ మళ్ళీ మొదలయ్యింది. పవన్ కళ్యాణ్ కూడా సాధువులాంటి లుక్ మార్చేసి మళ్ళీ లాయర్ లుక్ లోకి మారిపోయి వకీల్ సాబ్ షూట్ లో అడుగుపెట్టాడు. మరి పవన్ గట్టిగా అనుకుంటే మరో 20 రోజుల్లో వకీల్ సాబ్ షూటింగ్ ఫినిష్ చేసేస్తాడు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ ఫినిష్ అవ్వగానే అసలైతే క్రిష్ సినిమా చెయ్యాల్సి ఉంటుంది. దాని కోసం పవన్ కళ్యాణ్ కాస్త లుక్ చేంజ్ చెయ్యాల్సి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత క్రిష్ సినిమా కన్నా ముందే తాను కొత్తగా అనౌన్స్ చేసిన అయ్యప్పన్ కోషియం సినిమా రీమేక్ చేస్తానని దర్శకుడు శేఖర్ కే   చంద్రకి మాటిచ్చినట్టుగా సోషల్ మీడియా టాక్.

Advertisement
CJ Advs

అయ్యప్పన్ కోషియం సినిమాలో పవన్ కళ్యాణ్ రోల్ కి ఎక్కువ డేట్స్ అవసరం లేదు. అందుకే ముందు అయ్యప్పన్ కోషియం పూర్తి చేసేసి తర్వాత క్రిష్ సినిమా షూట్ లో జాయిన్ అవుతాడట పవన్. అసలైతే క్రిష్ సినిమా - అయ్యప్పన్ కోషియం రీమేక్ పారలల్ గా చెయ్యాల్సి ఉండగా.. ప్రతి సినిమాకి లుక్, గెటప్ మార్చాలంటే కొద్దిగా కష్టం.. కాబట్టే ముందు అయ్యప్పన్ రీమేక్ ఫినిష్ చెయ్యాలని పవన్ ఆలోచనట. ఇక అయ్యప్పన్ గా పవన్ కళ్యాణ్ కొద్దిగా గెడ్డం పెంచితే సరిపోతుంది. 

అలాగే ఈ సినిమాలో మరో హీరోగా రానానే నటించవచ్చని, పవన్ కళ్యాణ్ భార్య పాత్రకి ఐశ్వర్య రాజేష్ పేర్లు తెరపైకి వచ్చాయి. మరి వకీల్ సాబ్ షూట్ ఫినిష్ అయ్యేలోగా శేఖర్ కే చంద్ర పవన్ కోసం చిన్నపాటి సెట్ నిర్మాణం చేపట్టనున్నాడని.. పవన్ రాగానే అయ్యప్పన్ కోషియం షూట్ మొదలు పెడతారని అంటున్నారు.

Pawan Will Join These Sets After Vakeel Saab:

Pawan Kalyan Next Film Update After Vakeel Saab
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs