Advertisement
Google Ads BL

బిగ్ బాస్ కి హెల్ప్ కాని.. సమంత క్రేజ్?


అక్కినేని సమంత గ్లామర్ డాల్.. బుట్ట బొమ్మ.. అందమైన చూపులతో మతులు పోగొడుతుంది. ఏ విషయంలోనైనా తనకంటూ ఉన్న ప్రత్యేకతను చూపిస్తూనే ఉంటుంది. పెళ్లి తర్వాత కెరీర్ లో దూసుకుపోతూ అందరికి ఆదర్శముగా నిలుస్తున్న సమంత క్రేజ్ ఇప్పటికి సోషల్ మీడియాలోనూ, ఇండస్ట్రీలోని ఇసుమంతైనా తగ్గిన ఫీలింగ్ లేదు. సినిమా అవకాశాలు లేకపోయినా... వెబ్ సీరీస్ తోనూ, గ్లామర డాల్ గాను, తమిళ సినిమాలతో బిజీగా ఉంటున్న సమంత సోషల్ మీడియా క్వీన్. సమంత బికినీ వేసినా.. చీర కట్టినా అభిమానులు ఫిదా. అలాంటి సమంత క్రేజ్ బుల్లితెర మీద అంతగా కనిపించలేదు. దసరా పండగ సందర్భంగా నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కి సమంత హోస్ట్ గా స్టార్ మా లో అడుగుపెట్టింది. అందంగా, ఆకర్షణగా అణుకువగానే హోస్టింగ్ చేసింది.

Advertisement
CJ Advs

కానీ బిగ్ బాస్ కి సమంత క్రేజ్ పెద్దగా పనిచెయ్యలేదనిపిస్తుంది. మొదటిసారి ఓ టివి షో కి హోస్ట్ గా కనబడిన సమంత శాయశక్తులా బిగ్ బాస్ ప్రేక్షకులను మెప్పించింది. అయితే సమంత వచ్చింది ఆ క్రేజ్ తో స్టార్ టిఆర్పి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటే.. స్టార్ మా దసరా బిగ్ బాస్ ఎపిసోడ్ కి కేవలం 11.4 టీఆర్పీ రావడం మాత్రం సమంత, అక్కినేని అభిమానులకి షాకిచ్చింది. నాగార్జున వ్యాఖ్యాతగా సక్సెస్ ఫుల్ గా బిగ్ బాస్ సాగుతుంటే మధ్యలో సమంత రావడంతో టిఆర్పి భారీగా ఉంటుంది అనుకుంటే.. ఇక్కడ సమంత క్రేజ్ పెద్దగా పని చెయ్యలేదనిపిస్తుంది. ఎప్పుడూ మామతో పోటీ పడే కోడలు ఈ బిగ్ బాస్ విషయంలో మాత్రం మామ కన్నా కాస్త దిగువనే నిలుచుకుంది. ఏది ఏమైనా సమంత క్రేజ్ డౌన్ అవుతుంది అనడానికి ఈబిగ్ బాస్ ఎపిసోడ్ ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చేమో. 

Even Samantha Couldn’t Help Bigg Boss!:

<sup>Bigg Boss 4 Gets Low TRP Ratings</sup>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs