Advertisement
Google Ads BL

పెళ్లి తర్వాత కాజల్‌లో బిగ్ ఛేంజ్!


కాజల్ కెరీర్ అయిపోయింది అన్నప్పుడల్లా.. మళ్ళీ సినిమా అవకాశాలతో తానేమిటో చూపిస్తుంది. సీనియారిటి లిస్ట్‌లోకి ఎక్కినా కాజల్ సినిమా అవకాశాలతో ఇప్పటికి బిజీనే. ప్రస్తుతం ఆచార్య, భారతీయుడు సీక్వెల్ సినిమాలతో పాటుగా మంచు విష్ణుతో మోసగాళ్లు సినిమా చేసిన కాజల్ అగర్వాల్ గత వారం పెళ్లి పీటలెక్కింది. కాకపోతే పెళ్లికి ముందే పెళ్లి తర్వాత నా నటనను కొనసాగిస్తా అని చెప్పింది కాజల్ అగర్వాల్. ఇక పెళ్లి తర్వాత తాను పెళ్లి కూతురు ఫోటో షూట్స్, భర్త తో కలిసి ఉన్న ఫొటోస్ ని పోస్ట్ చెయ్యడమే కాదు... గౌతమ్ కిచ్లు తో ప్రేమ, పెళ్లి విషయాలను మీడియాతో పంచుకుంటుంది.

Advertisement
CJ Advs

అయితే ఉన్నట్టుండి కాజల్ అగర్వాల్ ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ చూసిన ఎవరైనా కాజల్ ఇక సినిమాల్లో నటించదేమో.. కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తుందేమో అని అనిపించక మానదు. ఇట్స్ నెవర్ టూ లేట్.. ఐ సే నో అంటూ కాజల్ చేసినా ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో పలు చర్చలకు దారి తీసింది. మరి కాజల్ కరోనాకి బాగా భయపడినట్లుగా కనబడడమే కాదు... భర్త కిచ్లు తో కొత్త జీవితం మొదలు పెట్టబోతున్న తరుణం లో కాజల్ ఇలా కొత్తగా ఆలోచిస్తోందా.. కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దు.. తర్వాత బాధపడడం కన్నా ఇప్పుడే కొన్నిటికి నో చెబితే వచ్చే నష్టమేమి లేదు.

అందుకే ప్రస్తుతం పరిస్థితులకు నో చెబుతున్నా అంటూ కాజల్ చెప్పడం చూస్తుంటే కాజల్ సినిమాలకు బ్రేకిచ్చినట్లే అనిపిస్తుంది. మరి కాజల్ కోసం ఎదురు చూస్తున్న ఆచార్య పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చినట్లే అనిపిస్తుంది. అలాగే భారతీయుడు 2 అంటే షూటింగ్ విషయం తెగలేదు కాబట్టి ప్రాబ్లెమ్ లేదు. ఇక విష్ణు మోసగాళ్ళలో కాజల్ అగర్వాల్ షూట్ పూర్తవడంతో వారు హ్యాపీ. కానీ ఆచార్య టీం మాత్రం ఇరుక్కున్నట్టే అంటున్నారు.

Kajal Takes sensational Decision:

Kajal Latest Tweet creates Sensation 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs