రామ్ చరణ్ కన్ఫ్యూజన్‌లో ఉన్నాడా? అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తండ్రి చిరు ఆచార్య సినిమాలో నటించాక.. రామ్ చరణ్ తదుపరి చిత్రంపై మెగా ఫ్యాన్స్‌కే కాదు.. రామ్ చరణ్‌కే క్లారిటీ లేదు. రామ్ చరణ్‌కి కథలు చెప్పడానికి చాలామంది డైరెక్టర్స్ వచ్చారు.. వెళ్లారు. మధ్యలో రామ్ చరణ్ తనకి కథ చెప్పడానికి వచ్చిన వారిని తండ్రి చిరుకు తగిలించాడనే టాక్ ఉంది. మరి రామ్ చరణ్ కి ఎలాంటి కథ కావాలి. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎలాంటి జోనర్ చేయాలనుకుంటున్నాడు.. అసలు రామ్ చరణ్ రేంజ్ కి టాలీవుడ్ దర్శకులు రీచ్ కాలేకపోతున్నారా.. అంటే నిజం అలానే ఉంది మరి.
ఆర్ఆర్ఆర్‌లో అల్లూరి పాత్ర చేస్తున్న రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీ చేసాక మళ్ళీ ఆ లెవెల్ కథే చెయ్యాలని ఫిక్స్ అయినట్లుగా ఉంది వ్యవహారం. అందుకే రామ్ చరణ్ ఆలోచనలని ఏ ఒక్క దర్శకుడు అందుకోలేకపోతున్నాడు. రాజమౌళి లాంటి పవర్ ఫుల్ కథ చెప్పే దమ్మున్నోడు కావాలి. లేదా ఆర్ఆర్ఆర్ తర్వాత ఏ పాన్ ఇండియా మూవీ అంటే.... బాలీవుడ్‌ని టార్గెట్ చెయ్యబోయే కథతో.. ఏ బాలీవుడ్ డైరెక్టర్ కో సినిమా ఓకే చెప్పాలని రామ్ చరణ్ చూస్తున్నాడా.. రాజమౌళితో మగధీర సినిమా తర్వాత రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. అందుకే ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ మళ్ళీ ఆర్ఆర్ఆర్ లాంటి పవర్ ఫుల్ కథకే ఫిక్స్ అయినట్లుగా కనబడుతున్నాడు. అందుకే ఏ దర్శకుడికి ఓకే చెప్పడం లేదనిపిస్తుంది.