Advertisement
Google Ads BL

ఈ కమెడియన్ జబర్దస్త్‌కి ఇక దూరమైనట్లేనా?


జబర్దస్త్ అంటే కమెడియన్స్‌కి ఒక పెద్ద ప్లాట్‌ఫామ్. అందులో అవకాశం దొరకాలంటే పెట్టిపుట్టాలి. జబర్దస్త్ కమెడియన్స్ తాము జబర్దస్త్ లోకి ఎంటర్ కావడానికి ఎన్ని బాధలు పడ్డారో అప్పుడప్పుడు చెబుతూనే ఉంటారు. అందుకే చాలామంది కమెడియన్స్ జబర్దస్త్‌ని వదలడానికి అసలు ఇష్టపడరు. కానీ బిగ్‌బాస్‌లో అవకాశం రాగానే జబర్దస్త్‌కి పది లక్షల ఫైన్ కట్టి మాస్ ముక్కు అవినాష్ బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. జబర్దస్త్‌లో టీం లీడర్‌గా ఉన్న అవినాష్‌కి బిగ్ బాస్ గాలం వేసింది. కాస్త ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న అవినాష్ జబర్దస్త్ అగ్రిమెంట్‌ని బ్రేక్ చేసి మరీ వచ్చాడనే టాక్ ఉంది. జబర్దస్త్‌ని వదిలి వెళ్తూ జబర్దస్త్‌ని బాగా కించపరిచిన నాగబాబు ఈమధ్యన జబర్దస్త్ అగ్రిమెంట్‌ని బ్రేక్ చేస్తే పది లక్షలు కట్టాలంటూ సెటైర్స్ కూడా వేస్తున్నాడు.

Advertisement
CJ Advs

అయితే బిగ్ బాస్‌లో కామెడీ చేస్తూ ప్రూవ్ చేసుకున్న అవినాష్ గత రెండు వారాలుగా విపరీతమైన ఆగ్రహంతో హౌస్ మేట్స్ మీద ఊగిపోతున్నాడు. నోయెల్ పోతూ పోతూ అవినాష్ కామెడీ.. చిల్లర కామెడీ అనడం, దాన్ని అభిజిత్ సపోర్ట్ చెయ్యడంతో అవినాష్ విశ్వరూపం బిగ్ బాస్‌లో బయటపడింది. కామెడీ చేస్తా అందుకే పిలిచారు అంటూ అభిజిత్‌తో కొట్లాట పెట్టుకున్నాడు కూడా. అయితే గత రాత్రి ఎలిమినేషన్స్ కోసం అవినాష్ నామినేట్ అయ్యాడు. దానితో బిగ్ బాస్ ఆదేశాలు ప్రకారం మిగతా హౌస్ మేట్స్ అంతా అవినాష్, మోనాల్, అభిజిత్, హారిక, అమ్మ రాజశేఖర్ లను మొహం కదపకుండా ఉండేలా వాళ్ళ మీద నీళ్లు పొయ్యడం, మట్టి చిమ్మటం, ఐస్ ట్యూబ్స్, కోడి గుడ్లు బ్రేక్ చెయ్యడం చేసినా హౌస్ మేట్స్ ఎవరూ కదలకపోయేసరికి అందరూ నామినేట్ అయినట్లుగా బిగ్ బాస్ ప్రకటించడంతో మాస్ అవినాష్ బాధపడుతూ అందరూ తమ అవకాశాలు, తమని తాము నిరూపించుకోవడానికి చాలా ఫైట్ చేస్తున్నారు అది నచ్చింది. కానీ నేను ఎలిమినేట్ అయితే నాకు చాలా సమస్య, నన్ను ఆ వేరే షో వాళ్ళు ఇక రావొద్దు అన్నారు. నాకు మరొక అవకాశం కూడా లేదు.. ఇదొక్కటే అవకాశం... ఎందుకు అంటే నన్ను ఆ షో వాళ్ళు మళ్ళీ రావొద్దన్నారు అంటూ సోహైల్, అరియనా వద్ద అవినాష్ బాధ పడడం చూస్తుంటే.. ఇక అవినాష్ కి జబర్దస్త్ వాళ్లు నో ఎంట్రీ బోర్డు పెట్టినట్లే అనే అనుమానం వస్తుంది. 

మరి మంచి లైఫ్ వదులుకుని ఎందుకువచ్చాడో అవినాష్‌కే తెలియాలి అంటుంటే.. అవినాష్ ని ఎలిమినేషన్స్ నుండి తప్పించమంటూ జబర్దస్త్ కామెడీ లీడర్స్ అందరూ సోషల్ మీడియాలో అవినాష్‌కి సపోర్ట్ చెయ్యమని పోస్ట్‌లు పెడుతున్నారు. 

Shocking News about Jabardasth Avinash:

Jabardasth Doors closed to Avinash with Bigg Boss
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs