నాగబాబు కూతురు నిహారిక లాక్ డౌన్ ఉన్నప్పుడే అంటే ఆగష్టు లో గుంటూరు రేంజ్ డిజి కొడుకు చైతన్య జొన్నలగడ్డ తో నిశ్చితార్ధం చేసుకుంది. నిహారిక నిశ్చితార్ధం మెగాఫ్యామిలీ సమక్షంలో గ్రాండ్ గానే చేసాడు నాగబాబు. ఇక నిహారిక పెళ్లి పనులు మొదలైనప్పటికీ... నిన్నటివరకు పెళ్లి డేట్ ఫిక్స్ చెయ్యలేదు మెగా ఫ్యామిలీ. నిహారిక పెళ్లి విషయాలను ఆమె అన్న వరుణ్ తేజ్ చూసుకోవడం.. నిహారిక పెళ్లి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఉండబోతుంది అని చెప్పినప్పటినుండి నిహారిక ఏ ప్లేస్ లో పెళ్లి చేసుకోబోతుందో అనే క్యూరియాసిటిలో మెగా ఫాన్స్ ఉన్నారు.
తాజాగా నిహారిక పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. ఆ విషయాన్నీ మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 9 రాత్రి 7.15 నిమిషాలకు నిహారిక - చైతన్య లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసారు. అంతేకాకుండా నిహారిక - చైతన్య ల పెళ్లి రాజస్థాన్ లోని ఉదయపూర్ ఉదయవిలాస్ పాలస్ లో జరగుతుందని.. ఈ పెళ్ళికి మెగా ఫ్యామిలీ మెంబెర్స్ తో పాటుగా ముఖ్య అతిధులు పాల్గొంటారని తెలుస్తుంది. మరి ఇప్పటికే నిహారిక పెళ్లి పనులు మెగా ఫ్యామిలిలో జరుగుతుండగా నిహారిక తన ఫ్రెండ్స్ తో కలిసి గోవా వెళ్లి అక్కడ బ్యాచులర్స్ పార్టీ కూడా పూర్తి చేసుకుంది.