Advertisement
Google Ads BL

రెమ్యూనరేషన్.. పవన్ స్ట్రాటజీ అదిరింది


పవన్ కళ్యాణ్ రాజకీయాలని తిరిగినా అక్కడ రాజకీయ నాయకుడిగా ప్రతాపం చూపించలేక బిజెపితో కలిసి ఎన్నికల్లో పోటీ చెయ్యాలని డిసైడ్ అయ్యి.. కేవలం డబ్బు కోసమే మళ్లీ సినిమాల్లోకి వచ్చాను అంటూ మొహమాటం లేకుండా చెప్పేశాడు. తన దగ్గర రాజకీయనాయకుల దగ్గరున్నంత డబ్బు లేదు కాబట్టే రాజకీయాల్లో ఎదగలేకపోతున్నా అని పవన్ ఫీలింగ్. అందుకే సినిమాలతో మళ్లీ సంపాదించి ఎన్నికల్లో ఖర్చు పెట్టే ఉద్దేశ్యం ఉందేమో.. కాబట్టే వరస సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. ఇక సినిమాకి ఇంత పారితోషకం అని కాకుండా వకీల్‌సాబ్‌కి రోజుకింత అని పారితోషకం అందుకున్నాడనే టాక్ ఉంది.

Advertisement
CJ Advs

ఇక క్రిష్ సినిమా, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలకు బల్క్ డేట్స్ కేటాయించి నిర్మాతలతో బల్క్ పారితోషకం మాట్లాడుకున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌కి ఎలా అయితే రోజుకింత అని పారితోషకం అందుకున్నాడో తన అయ్యప్పన్ కోషియం రీమేక్ సినిమాకి అలానే రోజుకి ఇంత రెమ్యునరేషన్ అని నిర్మాతలతో మాట్లాడేశాడట. ఇక అయ్యప్పన్ కోషియం సినిమాకి కేవలం 30 రోజుల డేట్స్ పవన్ కేటాయించాడట. ఆ 30 రోజులకి రోజుకింతని తీసుకుంటున్న పవన్.. వకీల్ సాబ్ పారితోషకంతో పోలిస్తే అయ్యప్పన్ కోషియం రీమేక్ పారితోషకాన్ని పవన్ ఎక్కువ అందుకోబోతున్నాడట.

ఇక అయ్యప్పన్ కోషియం రీమేక్ కి ఎక్కువ డేట్స్ అక్కర్లేదు కాబట్టే ఆ సినిమాకి పవన్ కమిట్ అయ్యాడని అంటున్నారు. ఇక సితార ఎంటర్టైన్మెంట్ వాళ్ళు - శేఖర్ కే చంద్ర పవన్ డేట్స్ ని జాగ్రత్తగా వాడుకుని రెండు నెలలో అయ్యప్పన్ కోషియం ముగిస్తామని పవన్ కి మాటిచ్చినట్టుగా ఫిలింనగర్ టాక్. మరి పవన్ పారితోషకం విషయంలో ఆయన మాస్టర్ ప్లాన్ అయితే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయినట్లే కనిపిస్తుంది.

This is the Pawan Kalyan strategy about remuneration :

Pawan Kalyan remuneration for his further movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs