Advertisement
Google Ads BL

అప్పుడు బాలీవుడ్ అంటే భయపడ్డానంటోంది


చాలామంది సౌత్ హీరోయిన్స్‌కి బాలీవుడ్‌లో నటించడం అనేది ఓ కల. ఎక్కడో కమిట్మెంట్ ఉన్న కొద్దిమంది హీరోయిన్స్ తప్ప చాలామంది బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. అక్కడ హిట్ కొడితే.. అక్కడికే జంప్ అయ్యేవారే. కానీ హిట్ కొట్టలేక సౌత్ లోనే ఆఫర్స్ పట్టుకుంటూ ఇక్కడే సెటిల్ అయినా.. బాలీవుడ్ మీద మోజు మాత్రం పోదు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్దే కూడా ఒకప్పుడు బాలీవుడ్‌లో దారుణమైన పరాభవం చవిచూసి సౌత్‌లో సెటిల్ అయినా... గత ఏడాది నుండి బాలీవుడ్ మూవీస్‌లో ఆఫర్స్ పట్టేస్తూ అక్కడా బిజీ అయ్యింది.

Advertisement
CJ Advs

అయితే బాలీవుడ్‌లో తాను నటించిన మొదటి చిత్రం మోహింజదారో ప్లాప్ అయినప్పుడు గుండె బద్దలయ్యిందని.. ఆ సినిమాకి కమిట్ అయ్యి సంతకం చెయ్యడంతో వేరే ఒప్పందాలు పెట్టుకోలేకపోయా అని, కానీ ఆ సినిమా ప్లాప్ తనని తీవ్రంగా నిరాశపరించింది కాబట్టే మళ్లీ బాలీవుడ్‌లో నటించడానికి బాగా టైమ్ తీసుకున్నానని, గత ఏడాది మళ్ళీ హౌస్ ఫుల్ 4 తో బాలీవుడ్ అవకాశాన్ని వినియోగించుకుని హిట్ కొట్టానని చెబుతుంది పూజా హెగ్డే. మరి ప్రభాస్‌తో రాధేశ్యాం పాన్ ఇండియా మూవీతో పాటుగా... రణ్వీర్ సింగ్ - రోహిత్ శెట్టి కాంబోలో తెరకెక్కుతున్న సర్కస్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. అందుకే పాప తెగ ఎగ్జైట్ అవుతుంది. రణ్వీర్ సింగ్ అన్నా, రోహిత్ శెట్టి సినిమాలన్నా చాలా ఇష్టమని.. అప్పుడెప్పుడో రామోజీ ఫిలిం సిటీలో రోహిత్ శెట్టిని కలిశా అని.. ఇప్పుడు అదే రోహిత్ శెట్టి సర్కస్ సినిమాలో అవకాశం రావడం అదృష్టం అని అంటుంది.

Pooja Hegde reaction on Rohit Shetty Circus:

Pooja Hegde fears with bollywood at the entry time
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs