Advertisement
Google Ads BL

కెఎఫ్‌సి చికెన్ బండి పెట్టుకోవచ్చు.. మనవరాళ్లతో చిరు!


మెగాస్టార్ చిరు సినిమాల్లోనే నెంబర్ వన్ కాదు.. వంటకాల్లో కూడా నెంబర్ వన్ షెఫ్. లాక్ డౌన్ లో చిరంజీవి తన తల్లి కోసం ఉప్మా పెసరట్టు వేసి పెట్టడం దగ్గరనుండి.. ఆయన చాలా రకాల డిషెస్ ఇంట్లో వాళ్ళ కోసం చేసిపెట్టారు. మరి సండే ఫన్ డే అన్నట్టుగా మానవరాళ్లతో.. చిరు సండే బోర్ కొడుతోంది అంటే.. మనవరాళ్లు ఇద్దరూ కె ఎఫ్ సి తినాలనుంది అనగానే.. బయట తిళ్ళు తింటే ఆరోగ్యం పడివుంది.... ఎందుకు మనమే ఇంట్లో చేద్దామంటూ మానవరాళ్లతో కలిసి కె ఎఫ్ సి చికెన్ వండేశాడు చిరు.

Advertisement
CJ Advs

చికెన్ లెగ్ పీస్ లతో వాటికీ ఎంతెంత మసాలా కావాలో మానవరాళ్లతో చెప్పించి.. వాటిని మానవరాళ్లతోనే కలిపి ప్రిజ్ లో పెట్టించిన మూడు గంటలు నానిన తర్వాత చిరు కె ఎఫ్ సి కుక్ చెయ్యడానికి వచ్చేసరికి మనవరాళ్లు ఇద్దరూ కె ఎఫ్ సి కోసం మైదా కలపడం చూసి అమ్మొ పిల్లలు చాలా ముదుర్లు.. ఇదంతా చూస్తుంటే రోడ్డు మీద బండి పెట్టి కె ఎఫ్ సి చికెన్.. కె ఎఫ్ సి చికెన్ అంటూ అమ్మేయ్యొచ్చు అని కామెడీ చెయ్యడమే కాదు.. ఆ చికెన్ లెగ్ పీసెస్ ని మాసాలతో పాటుగా మైదా తగిలించి ఆయిల్ ఉన్న బాండీలో  వేయించి.. కె ఎఫ్ సి తయారు చేసేసారు చిరు అండ్ మనవరాళ్లు.

మరి యమ్మీగా ఉన్న ఆ కె ఎఫ్ సి తిన్న మవారాళ్ళు  తాతగారికి థాంక్స్ కూడా చెప్పారు.. ఆ వీడియో చిరు ట్విట్టర్ లో షేర్ చెయ్యడమే కాదు.. రేపటి తరం అభిరుచికి నచ్చేటట్టు, రుచిగా ఏమన్నా చేయగలిగితే...ఆ కిక్కే వేరప్పా. అంటూ తమ్ముడి పవన్ డైలాగ్ ని వాడేసాడు. ప్రస్తుతం చిరు కె ఎఫ్ సి వంటకం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Megastar makes KFC Chicken with his grand daughters:

Sunday special: KFC Chicken turns Mega grand daughters Chiken
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs