Advertisement
Google Ads BL

మెగాహీరో మూవీ నుంచి ఆ హీరోయిన్ అవుట్!


కరోనా లాక్‌డౌన్ అందరినీ ఎంత ముంచిందో తెలియదు కానీ.. హీరోయిన్స్‌ని మాత్రం బాగా ముంచేసింది. కరోనా కారణంగా వాయిదా పడిన షూటింగ్స్, వాయిదా పడిన సినిమాల ఓపెనింగ్స్ అన్ని మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యాయి. అన్ని సినిమాలు ఒకేసారి పట్టాలెక్కేస్తున్నాయి. హీరోలంటే ఒక్కో సినిమా చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి డేట్స్ ప్రాబ్లమ్స్ రావు. కానీ హీరోయిన్స్‌కి మాత్రం డేట్ల సర్దుబాటు కష్టాలు మాములుగా లేవు. మీడియం రేంజ్, టాప్ రేంజ్ హీరోయిన్స్ చేతుల్లో ఒకటి రెండు సినిమాలున్నాయి. కానీ ఇప్పుడు కరోనా కారణంగా అన్ని సినిమాలు ఒకేసారి సెట్స్ మీదకి రావడంతో హీరోయిన్స్ తిప్పలు మాములుగా లేవు. కరోనా కారణంగా ఆరు నెలల టైం వేస్ట్ అవడంతో.. దర్శకనిర్మాతలు ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా సినిమాల షూటింగ్స్ ఫినిష్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇక తాజాగా హీరోయిన్స్ డేట్స్ అడ్జస్ట్ ప్రాబ్లమ్‌లో ఇప్పుడు నివేద పేతురాజ్ చిక్కుకుంది. బ్రోచేవారెవరురా, చిత్రలహరి సినిమాలతో పాటుగా అల వైకుంఠపురములో సుశాంత్ మామ కూతురిగా మెరిసిన నివేద పేతురాజ్.. మెగాహీరో సాయి తేజ్ - దేవ కట్టా కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే షూటింగ్ మొదలు కాబోతోన్న తరుణంలో ఇప్పుడు డేట్స్ అడ్జెస్ట్మెంట్ చేయలేక సాయి తేజ్ సినిమా నుండి నివేద పేతురాజ్ తప్పుకోవడంతో హీరో, దర్శకుడు తమిళ నటి ఐశ్వర్య రాజేష్‌ని తమ సినిమా కోసం ఎంపిక చేసినట్టుగా టాక్. మరి అరా కొర సినిమాలతో ఉన్న నివేద పేతురాజ్‌కి కరోనా లాక్‌డౌన్ మాములు షాకివ్వలేదుగా అంటున్నారు.

Heroine Changed for Deva Katta and Sai Tej Film:

Nivetha pethuraj out.. Aishwarya Rajesh in for Sai Tej Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs