Advertisement
Google Ads BL

బిగ్‌బాస్: దెబ్బకి మంచోడి ఇమేజ్ పోయిందిగా!


బిగ్‌బాస్ సీజన్ 4కి మొదటి వారంలోనే వైల్డ్ కార్డు ఇచ్చిన కమెడియన్ జబర్దస్త్ అవినాష్ హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండి మంచివాడిగా కామెడీ చేస్తూ అందరితో కలిసిపోయాడు. అవినాష్ హౌస్‌లోకి అడుగుపెట్టాకే బిగ్‌బాస్‌లో కామెడీ పంచెస్ పేలుతున్నాయి. అతను నడిచినా కామెడీనే, మాట్లాడినా కామెడీనే, ఏం చేసినా కామెడీనే అన్నట్లుగా బాగా వర్కౌట్ అవుతుంది. ఇక శనివారం, ఆదివారం కూడా నాగార్జున అవినాష్ కామెడీని బాగా పొగడడం హైలెట్ చెయ్యడం జరుగుతుండడంతో.. అవినాష్ కి బయట మంచి ఫ్యాన్స్ స్టార్ట్ అయ్యారు. అందులోనూ కామెడీ ప్రియులు అవినాష్‌కి అండగా ఉండనే ఉన్నారు.

Advertisement
CJ Advs

ఇక అరియానాతో అవినాష్ స్నేహం, మధ్యలో పెళ్లి ముచ్చట్లతో మంచివాడిగా టాగ్ తగిలించుకున్నాడు అవినాష్. ఇక ఒక వారం బిగ్‌బాస్ టాస్క్‌లో అవినాష్ సంచాలక్ అయిన సోహైల్ మీద ఫైర్ అయ్యాడు. కామెడీ అంటే కామెడీ చేస్తాం, కోపం వస్తే కోపం చూపిస్తాం అంటూ బాగా కోపం తెచ్చుకున్నాడు. అదలా ఉంటే శనివారం ఎపిసోడ్‌లో అనారోగ్య కారణాలతో బిగ్‌బాస్ హౌస్‌ని వీడిన నోయెల్ పోతూ పోతూ అవినాష్‌ని అమ్మ రాజశేఖర్‌ని బ్యాడ్ చేసి వెళ్లాడు. అవినాష్‌ని చిల్లర కామెడీ చేస్తూ.. నా కాళ్ళ నొప్పులను నువ్వు కామెడీ చేశావ్ అనగానే.. అవినాష్ ఆగ్రహంతో ఊగిపోయాడు. నేను చిల్లర కామెడీ చేసే వాడిని అయితే బిగ్‌బాస్‌లోకి రాను.. నన్ను ఇక్కడికి పిలవరు, హౌస్‌లో ఉండగా నా కామెడీ ఎంజాయ్ చేసి వెళుతూ వెళుతూ ఓ ఇద్దరినీ బ్యాడ్ చేయాలని బాగా ఫిక్స్ అయ్యావు. కోట్లమంది బిగ్‌బాస్‌ని చూస్తున్నారు. నేను చిల్లర కామెడీ చేస్తున్నానా.. అంటూ అవినాష్ మొహం వాడిపోయింది. కోపంతో అవినాష్ ఊగిపోయాడు. 

మరి ఇప్పటివరకు మంచివాడు అనిపించుకుంటూ ఉన్న అవినాష్ నోయెల్ చేసిన ఒకే ఒక్క మాటతో ఎంత బ్యాడ్ అయ్యాడంటే.. అది మాములు డ్యామేజ్ కాదు... నోయెల్ ఏమన్నా అవినాష్ కామ్‌గా ఉంటే సరిపోయేది. హౌస్ మేట్స్ కామెడీ చెయ్యమంటే చేశా అని చెప్పేస్తే సరిపోయేది. కానీ అవినాష్ అలా రెచ్చిపోయి తనని తానే కాస్త బ్యాడ్ చేసుకున్నాడా అనిపించక మానదు.

Bigg Boss: Avinash vs Noel Sean:

Noel Sean damaged Avinash Image at Bigg Boss
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs