Advertisement
Google Ads BL

త్రివిక్రమ్‌తో సినిమా.. ఆ హీరో కోరిక ఇదే!


త్రివిక్రమ్ జోనర్ ఏది అంటే.. కామెడీతో కూడిన మాటల తూటాలు పేలుతుంటే... ప్రేక్షకుడు మైమరచి కుర్చీలకు అతుక్కుపోవాల్సిందే. త్రివిక్రమ్ సినిమా అంటే ఫ్యామిలీస్ అంతా కూర్చుని ఎంజాయ్ చేసే సినిమా. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన అతడు, జల్సా, ఖలేజా సినిమాలు థియేటర్స్ హిట్ కాకపోయినా.. బుల్లితెర మీద బ్లాక్ బస్టర్ హిట్స్. ఇప్పటికి ఆ సినిమాలకు ఆయా ఛానల్స్ కి మంచి టీఆర్పీ తెచ్చిపెడతాయి. ఇక అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ అయినా.. ఆ సినిమాలో వెటకారపు కామెడీ హైలెట్. అయితే అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి సినిమాలు నార్మల్ హిట్స్ అయినా.. అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా. మరి త్రివిక్రమ్ తన జోనర్ లో సినిమాలు చేస్తే పక్కా హిట్స్.

Advertisement
CJ Advs

కానీ హీరోలు కెలికితే ఒక అజ్ఞాతవాసి.. ఒక అరవింద సమేత లాంటి సినిమాలు వస్తాయి. కానీ లేదంటే త్రివిక్రమ్ జోనర్ లో అలాంటి సినిమాలు ఫ్యాన్స్ అస్సలు ఊహించుకోలేరు. అందుకే త్రివిక్రమ్ జోనర్లోనే సినిమా కావాలని హీరో రామ్ పట్టుబడుతున్నాడట. ఎన్టీఆర్ తో సినిమా చేసే సమయం చాలా ఉన్నందున త్రివిక్రమ్ ఇప్పుడు ఇస్మార్ట్ హీరో రామ్ తో ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తుండగా.. రామ్ త్రివిక్రమ్ తో మనకి ఓ జులాయి లాంటి కథ అయితే బావుంటుంది. 

ఇస్మార్ట్ శంకర్ లో మాస్ గా కనబడిన రామ్.. రెడ్ లో కాస్త డిఫరెంట్ రోల్ ప్లే చెయ్యడంతో.. ఇప్పుడు తన జోనర్ నుండి బయటికి వచ్చి త్రివిక్రమ్‌తో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెయ్యాలని రామ్ కోరికగా చెబుతున్నారు. మరి త్రివిక్రమ్ - రామ్ కాంబో సెట్ ఐయితే.. పక్కాగా జులాయికి సీక్వెల్ తయారవుతుందేమో చూడాలి. 

Hero Ram wants that type of movie from Trivikram:

Trivikram Srinvias and Ram movie on cards
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs