తెలుగులో బిగ్ బాస్ అంటే సుత్తి బాస్ అన్నమాదిరిగా తయారైంది ప్రస్తుత సీజన్. లవ్ స్టోరీస్ తో గెటాన్ అవుతున్న బిగ్ బాస్ లో ఏ కంటెస్టెంట్ ఎప్పుడు ఎవరితో ఉంటుందో.. ఏ కంటెస్టెంట్ ఎందుకు ఏడుస్తుందో.. చెప్పకుండానే ఆ ఎమోషనల్ సీన్స్ ని బుల్లితెర ప్రేక్షకుల మీద రుద్దడమే బిగ్ బాస్ పనిగా పెట్టుకుంది. ఇక అఖిల్ - మోనాల్ లను మరీ లవర్స్ మాదిరిగా చూపించడం.. అభిజిత్ - హరికలను ఎప్పుడు ఎలా చూపిద్దామా అని తప్పితే.. గేమ్ లో మంచి టాస్క్ పెడదాం.. అనేది లేకుండా పోయింది. బిగ్ బాస్ గతంలో మాదిరిగా ఇప్పుడు క్రేజ్ తెచ్చుకోలేక నానా తంటాలు పడుతుంది. మరోపక్క సోషల్ మీడియాలో బిగ్ బాస్ పై ట్రోల్స్ భీభత్సంగా వస్తున్నాయ్. అలాగే బిగ్ బాస్ సీక్రెట్స్ లీకేజీని ఆపలేక బిగ్ బాస్ యాజమాన్యం నానా తంటాలు పడుతుంది.
ఇప్పుడు టీఆర్పీ విషయంలోనూ బిగ్ బాస్ యాజమాన్యానికి పెద్ద తలనొప్పి స్టార్ట్ అయ్యింది. వీకెండ్స్ లో ఎలాగో లాగిస్తున్న బిగ్ బాస్ వీక్ డేస్ లో వీకవుతుంది అని అనుకున్నట్టుగానే.. వీక్ డేస్ లో బిగ్ బాస్ టీఆర్పీ గత రెండు వారాలుగా బాగా డౌన్ అయినట్లుగా తెలుస్తుంది. మరి దారుణంగా 5.2 రేటింగ్ తో బిగ్ బాస్ వీక్ డేస్ లో రన్ అవడం బిగ్ బాస్ కే అవమానం అనేలా ఉంది. గతంలోనే నాగార్జున బిగ్ బాస్ టీఆర్పీ విషయంలో బిగ్ బాస్ యాజమాన్యంతో ఆగ్రహంతో ఉన్నాడని అన్నారు. ఇప్పుడు 7 వ వారంలో బిగ్ బాస్ టీఆర్పీ 5.2 వస్తే.. ఆదివారం దసరా పండగ రోజున మూడున్నర గంటల బిగ్ ఎపిసోడ్ ని సమంత చేత హోస్ట్ చేయించిన ఆ ఎపిసోడ్ కి కేవలం 7.5 టీఆర్పీ రావడంతో బిగ్ బాస్ యాజమాన్యమే షాకయినట్లుగా చెబుతున్నారు.
సమంత వలన పండగ పూట కనీసం 10 రేటింగ్ దాటుతుంది అనుకుంటే.. మరీ చీప్ గా 7.5 రావడం బిగ్ బాస్ కే మింగుడు పడడం లేదట. మరి పండగ సమయంలో జనాలు టివి వదిలేసి బయట తిరగడం, చుట్టాల ఇంటికి వెళ్లడం చేసినట్లుగా ఉన్నారు. అయితే పండగ రోజు స్పెషల్ ఎపిసోడ్ ని బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా హాట్ స్టార్ లో వీక్షించినట్లుగా తెలుస్తుంది.