Advertisement
Google Ads BL

రోజాపై సెటైర్‌.. చిక్కుల్లో హైపర్‌ ఆది


హైపర్ ఆది.. ఎవరిమీదైనా సెటైర్ వేసి నవ్వించగల సత్తా ఉన్న కమెడియన్. జబర్దస్త్‌లో హైపర్ ఆది స్కిట్ కి ఓ ప్రత్యేకత ఉంటుంది. తన టీం సభ్యులపైన, జెడ్జెస్ మీద, యాంకర్ మీద అబ్బో సినిమా సెలెబ్రెటీస్, పొలిటికల్ లీడర్స్ ఇలా ఎవ్వరిని వదలకుండా అనర్గళంగా పంచ్‌లతో నవ్వించగలడు. ఆది స్కిట్ కొట్టకపోతే జబర్దస్త్ ప్రేక్షకులకు నీరసాలే. అలాంటి ఆది అంటే చాలామంది హీరోల, పొలిటికల్ లీడర్స్ అభిమానులకు మంట. ఎక్కడ కనబడితే అక్కడ వేసేద్దాం అని చూస్తుంటారు. తాజాగా హైపర్ ఆది రోజా ఫ్యాన్స్ కి బుక్ అయ్యాడు. ఎలా అంటే ఈటీవీలో దీపావళి స్పెషల్ ప్రోగ్రాం శ్రీ కనక మహాలక్ష్మి లక్కీ డ్రాలో ఆది, రోజాపై వేసిన పంచెస్ అలాంటి ఇలాంటివి కాదండోయ్.. ప్రస్తుతం శ్రీ కనక మహాలక్ష్మి లక్కీ డ్రా ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్‌లో ఉంది.

Advertisement
CJ Advs

శ్రీ కనక మహాలక్ష్మి లక్కీ డ్రా ప్రోగ్రాం జెడ్జెస్‌గా రోజా - శేఖర్ మాస్టర్ రాగా.. స్టేజ్ మీద శేఖర్ మాస్టర్ - రోజాలు డాన్స్ పెరఫార్మెన్సుతో ఇరగదియ్యగా.. దానికి యాంకర్ శ్రీముఖి.. అదృష్టం అంటే ఏంటి అంటూ శేఖర్ మాస్టర్‌ను అడగగా.... దానికి వెంటనే రోజా గారు తన ముందుండటమే అంటూ సమాధానమిచ్చాడు శేఖర్. అంటే అక్కడే ఉన్న హైపర్ ఆది వెంటనే అదిరిపోయే సెటైర్ వేశాడు. ముసలోళ్లకు దసరా పండగ అంటారు.. ఈ దివాళీ ఏంట్రా మనకు అంటూ పంచ్ వేశాడు. దానితో అక్కడున్న వారంతా నవ్వులు పూయించారు. 

ఇక రోజా తర్వాత ఆవేశంగా ఇక్కడ లక్కీ డ్రాలో కారు ఉంది.. 10 లక్షల క్యాష్ ఉంది.. ఇల్లు ఉంది.. బంగారం ఉంది.. నేనెలా చెప్పాను అంటుండగానే.. హైపర్ ఆది అందుకుని..  అసెంబ్లీలో అదేదో బిల్ ప్రవేశపెట్టినట్లే చెప్పారంటూ రోజాపై సెటైర్ వేశాడు. మరి ఏపీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న రోజాను ఏమన్నా అంటే ఆమె అభిమానులు ఎందుకూరుకుంటారు. అందుకే హైపర్ ఆది ఎక్కడ కనబడితే అక్కడ వేసెయ్యాలని కసితో కనబడుతున్నారు రోజా ఫ్యాన్స్. 

Roja fans angry on Hyper Aadi:

Hyper Aadi satire on Roja in comedy show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs