Advertisement
Google Ads BL

కీర్తిసురేష్‌ మళ్లీ రాంగ్‌ స్టెప్‌ వేస్తోందా..?


మహానటి కీర్తి సురేష్ మీద అభిమానులు ఫైర్ అవుతున్నారు. కీర్తి సురేష్ అనవసరంగా కెరీర్ ని పాడు చేసుకుంటుంది. మహానటి కోసం అంటే బరువు పెరిగి కెరీర్ లో కాస్త డల్ అయినా మళ్ళీ స్టార్ హీరోల ఛాన్స్ లు పట్టుకున్న టైంలో చిరంజీవికి చెల్లెలి కేరెక్టర్ లో వేదాళం రీమేక్ లో ఎందుకు నటించడం అంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు కీర్తి సురేష్ ని ఆడుకుంటున్నారు. మెహెర్ రమేష్ డైరెక్ట్ చెయ్యబోయే వేదాళం రీమేక్ లో కీర్త్ సురేష్ చిరు చెల్లెలిగా ఫిక్స్ అయ్యింది అని.. కీర్తి సురేష్ ని సంప్రదించిన మూవీ టీంకి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ నడుస్తుంది.

Advertisement
CJ Advs

అయితే కీర్తి సురేష్ చెల్లెలి కేరెక్టర్ ఎందుకు ఒప్పుకుంది. అది చిరంజీవి సినిమా కాబట్టి ఆయనతో యాక్ట్ చెయ్యడం ఇంట్రెస్ట్ కాబట్టి ఒప్పుకుందా? లేదంటే వేదాళం రీమేక్ లో చెల్లెలిగా నటించేందుకు నిర్మాత బాగా రెమ్యూనరేషన్ ముట్ట చెబుతున్నారా? ఎందుకు ఈ సినిమా ఒప్పుకుని కీర్తి రిస్క్ చేస్తుంది. అసలు కెరీర్ లో స్టార్ ఛాన్సెస్ రావడమే కష్టం. అలాంటిది మహేష్ సర్కారు వారి పాటలో ఛాన్స్ వచ్చింది. 

అలాంటి టైంలో చెల్లెలి కేరెక్టర్ ఒప్పుకుని కెరీర్ ని నాశనం చేసుకోవడం తప్ప మరేమి లేదు. పారితోషకం కోసం అయితే ఇలాంటి రిస్క్ అవసరం లేదు అంటున్నారు కీర్తి అభిమానులు. మరి కీర్తి సురేష్ అభిమానుల బాధను అర్ధం చేసుకుంటుందో.. లేదంటే.. మరేదన్నానో చూడాలి.

Keerthy Suresh In Chiranjeevi’s Vedalam Remake:

Award Winning Actress Risking For Chiru Or Pay  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs