బిగ్ బాస్ సీజన్ 4 చప్పగా సాగుతుంది. రోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరగాల్సింది పోయి.. దాని మీద ప్రేక్షకుల్లో నెగెటివిటి ఏర్పడుతుంది. కంటెస్టెంట్స్ లో ఒకరో ఇద్దరో గేమ్ మీద పట్టు సాధించి బాగా ఆడుతున్నారు. మిగతా వాళ్ళు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక చెత్త గేమ్ ఆడుతున్నారు. మంచిగా గేమ్ ఆడేవాళ్ళని బిగ్ బాస్ బయటికి పంపడం బిగ్ బాస్ చేసిన బిగ్ మిస్టేక్. అయితే బిగ్ బాస్ లో ఎన్నో రూల్స్. ఏది ఏమైనా ఆ రూల్స్ అతిక్రమించకూడదు. ఎలాంటి సెలెబ్రిటీ కంటెస్టెంట్ అయినా ఆ రూల్స్ కి ఒప్పుకున్నాకే హౌస్ లోకి అడుగుపెట్టాలి. అలాంటిది ఇప్పుడు బిగ్ బాసే రూల్స్ ని బ్రేక్ చేస్తున్నాడు.
మొన్నటికి మొన్న గంగవ్వని ఇంట్లో ఉంచి.. ఆమె ఆరోగ్యం పాడవుతుంది అని మొత్తుకున్నా ఆమెకి నచ్చజెప్పి హౌస్ లోనే ఉంచిన బిగ్ బాస్ చివరికి గంగవ్వని బయటికి పంపెయ్యాల్సి వచ్చింది. ఇక తాజాగా బిగ్ బాస్ రూల్స్ మీరి నోయెల్ ని బిగ్ బాస్ బయటికి పంపిస్తుంది. నోయెల్ గత కొన్ని రోజులుగా హెల్త్ ఇష్యుస్ తో సఫర్ అవుతున్నాడు. నిన్న రాత్రి నోయెల్ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి అక్కడ డాక్టర్ చెక్ చేసిన తర్వాత నోయెల్ ని హౌస్ నుండి బయటికి వెళ్లి మంచి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉందని బిగ్ బాస్ హౌస్ నుండి గురువారం రాత్రి ఎపిసోడ్ లో బయటికి పంపేశారు.
నోయెల్ అనారోగ్యంతో బయటికి రావడంతో హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ ఎక్కి ఎక్కి ఏడవడం అందరిని కదిలించింది. మరి పర్టిక్యులర్ రూల్స్ మెయింటింగ్ చేసే బిగ్ బాస్ కి ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ఆరోగ్యం కారణముగా రూల్స్ ని బ్రేక్ చెయ్యాల్సి వస్తుంది.