పవన్ కళ్యాణ్ సినిమాల లిస్ట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. పవన్ సినిమాలు చేస్తుంటే ఆయన ఫ్యాన్స్ కి పండగే. కానీ నిర్మాతలకు గండం. ఎందుకంటే పవన్ తో సినిమాలు కమిట్మెంట్ చేయించుకుని ఆనందపడేలోపే పవన్ కళ్యాణ్ చాలాసార్లు చాలా నిర్మాతలకు హ్యాండ్ ఇచ్చేశాడు. గతంలో అంటే అజ్ఞాతవాసి టైములో రెండు మూడు సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్నాక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లి నిర్మాతలకు పరీక్ష పెట్టాడు. మళ్ళీ సినిమాల్లోకి వచ్చేవరకు ఆ నిర్మాతలకు కంటి మీద కునుకు లేదు. కారణం అడ్వాన్స్ ఇచ్చి లాక్ అయ్యి.. పవన్ కోసం పిచ్చెక్కేలా ఎదురు చూశారు. ఓకే ఎలాగో వచ్చాక వకీల్ సాబ్, క్రిష్, హరీష్ సినిమాలు పూర్తి చేసే పోతాడనుకుంటే.... మళ్ళీ మరో రెండు సినిమాలు లైన్ లోకొచ్చాయి.
పవన్ కళ్యాణ్ తో సినిమాలు చెయ్యాలని కలలు కన్న దర్శకనిర్మాతలు పవన్ కోసం కథ, స్క్రిప్ట్ పూర్తి చేసుకుని ఎదురు చూసేలా కనబడుతుంది వాళ్ళ వ్యవహారం. కానీ పవన్ కళ్యాణ్ చాలా స్లోగా షూటింగ్ చేస్తాడు. తిక్కలెగిస్తే రాజకీయాలంటాడు. పవన్ ఏం చేస్తాడో పవన్ కే క్లారిటీ ఉండదు. మరి వరస సినిమాలతో పవన్ అందరిని హుషారు చేస్తున్నాడు కానీ.. తర్వాత నిర్మాతలు, దర్శకులు పవన్ వలన ఇబ్బంది పడాలి.
నిర్మాతలంటే ఓకే.. ఎలాగో ఎప్పటికైనా పవన్ సినిమా చేస్తాడు. కానీ దర్శకులు పవన్ కోసం వేచి చూడలేరు. అలాగని మధ్యలో సినిమాలు చెయ్యలేరు. మరి వరసగా మొదలు పెట్టిన సినిమాలన్నీ పవన్ ఎప్పటికి పూర్తి చేస్తాడో చూడాలి.