కాజల్ అగర్వాల్ - గౌతమ్ కిచ్లు ల వివాహం ముంబై లోని ఓ హోటల్ లో అంగరంగ వైభవంగా కొద్దిమంది అతిథులు కుటుంబ సభ్యుల మధ్యన జరిగింది. గత నాలుగు రోజులుగా కాజల్ అగర్వాల్ పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో వీక్షిస్తూనే ఉన్నాము. మెహిందీ, పసుపు ఫంక్షన్ లో చందమామలా వెలిగిపోతూ కాజల్ పెళ్లి కూతురులా తయారైంది. ఇక నేడు పెళ్లి దుస్తుల్లో కాజాల గర్వాల్ మెరిసిపోతూ భర్త గౌతమ్ పక్కన చందమామలా నిలబడింది. కాజల్ పెళ్లి ఫోటో ఇప్పుడు ఒకటి సోషల్ వైరల్ ఐయ్యింది. పెళ్లి దుస్తుల్లో చాలా అందంగా కనబడుతున్న కాజల్ అగర్వాల్.. మేడలో పెళ్లి వరమాలతో... భర్త పక్కనే చురునవ్వులు చిందిస్తుంది.
పెళ్లి డ్రెస్, అలాగే ఆభరణాలతో కాజల్ అగర్వాల్ పెళ్లి కూతురు గెటప్ లో చాలా అందంగా కనబడుతుంది. మరి పెళ్లి సింపుల్ గా ముంబై లో చేసుకున్న కాజల్ అగర్వాల్.. సౌత్ ఇండస్ట్రీకి సంబందించిన కొంతమంది గెస్ట్ లకు హైదెరాబాదులో రిసెప్షన్ ఏర్పాటు చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. కరోనా కారణముగా పెళ్లిని సింపుల్ గా చేసుకున్న కాజల్ రిసెప్షన్ కూడా హడావిడి లేకుండా ముగించే ఏర్పాట్లలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక కాజల్ అగర్వాల్ మెహిందీ వేడుకలో ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ భావోద్వేగానికి గురైన ఫోటో కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.