Advertisement
Google Ads BL

ఆ రింగ్‌తో పునర్నవి చెప్పబోయే ముచ్చటేంటి?


గత బిగ్ బాస్ సీజన్‌లో విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో చెట్టాపట్టాలేసుకుని హౌస్‌లో అల్ల్లరి చేసిన పునర్నవి భూపాలం.. తర్వాత సినిమా అవకాశాలు, హాట్ హాట్ ఫొటోస్ షూట్స్ తో బాగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్‌కి వెళ్ళకముందు సినిమాల్లో నటించిన పునర్నవికి బిగ్ బాస్ సీజన్ 3 మంచి పేరు తెచ్చింది. అయితే బిగ్ బాస్ హౌస్‌లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో క్లోజ్ గా ఉండడం చూసిన వాళ్ళు.. వాళ్లిద్దరూ లవ్‌లో ఉన్నారని అనుకున్నారు. బిగ్ బాస్ నుండి వచ్చాక పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం జరిగింది. అయితే పునర్నవి కానీ, రాహుల్ కానీ ఎక్కడా తాము ప్రేమలో ఉన్నట్లుగా బయటపెట్టలేదు. సో సీక్రెట్ లవర్స్ అంటూ అందరూ ఫిక్స్ అయ్యారు.

Advertisement
CJ Advs

ఇక రాహుల్ సింగర్‌గా కెరీర్‌లో బాగా బిజీ అవగా.. తాజాగా పునర్నవి పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా సోషల్ మీడియా, వెబ్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ట్విట్టర్‌లో పునర్నవి తన చేతికి నిశ్చితార్ధపు ఉంగరాన్ని చూపిస్తూ ఫోటోకి ఫోజివ్వడమే కాదు.. రేపు 30వ తారీఖున ఓ ముచ్చట చెప్పబోతున్నట్టుగా చెప్పి అందరికి షాకిచ్చింది. మరి పునర్నవి పెళ్లి చేసుకోబోయేది రాహుల్ నా లేక మరేవరినన్నానా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. గతంలో రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి లైఫ్‌లో మరొకరున్నారని చెప్పినా పునర్నవి - రాహుల్ విషయంలో న్యూస్ మాత్రం ఆగలేదు. సో ఇప్పుడు పునర్నవి తనకి కాబోయే వరుడిని పరిచయం చేసే వరకు అందరిలో ఈ డౌట్స్ ఆగవు.

Actress Punarnavi Bhupalam gets engaged?:

Punarnavi Bhupalam posted engaged pic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs