Advertisement
Google Ads BL

ఆ రీమేక్‌లో పవన్ భార్యగా ఎవరు?


పవన్ కళ్యాణ్ వరస సినిమాలు ఒప్పుకుంటూ ఫ్యాన్స్‌కి ఊపిరాడని కిక్ ఇస్తున్నాడు. ఫ్యాన్స్ తేరుకునే లోపే ఒక్కొక సినిమా కమిట్ అవుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ మలయాళంలో హిట్ అయిన అయ్యప్పన్ కోషియం రీమేక్ ఒప్పుకున్నాడు. ఆ సినిమాలో మరో హీరోగా రానా లేదా నితిన్ పేర్లు పరిగణనలో ఉన్నాయి. మలయాళంలో బిజూ మీనన్ పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ కేరెక్టర్‌పై మంచి అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాలో ఓ హీరోయిన్ పాత్ర ఉంటుంది. నిడివి తక్కువైనా బిజూ మీనన్ వైఫ్ పాత్రకి కాస్త ప్రిఫరెన్స్ ఉంది. మరి తెలుగులో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో ఆ కేరెక్టర్ ఎవరు చేస్తారనే దానిపై అందరిలో ఆసక్తి మొదలైంది.

Advertisement
CJ Advs

 

వకీల్ సాబ్‌లో పవన్ భార్య గా శృతి హాసన్ నటిస్తుంటే... హరీష్ శంకర్ సినిమాలో పవన్ జోడిగా పూజా హెగ్డే పేరు ప్రచారంలో ఉంది. ఇక సురేందర్ రెడ్డి, క్రిష్ సినిమాల్లో హీరోయిన్స్ ని ఫైనల్ చెయ్యాల్సి ఉంది. అయితే ఇపుడు అయ్యప్పన్ కోషియం సినిమాలో పవన్ భార్య పాత్రలో కాస్త సీనియర్ నటీమణులు నటించే ఛాన్స్ ఉందని..ఆ పాత్ర డి గ్లామర్ పాత్ర గా ఉంటుంది అంటున్నారు. అయితే ఆ పాత్రలో పవన్ భార్యగా ప్రియమణి నటించే ఛాన్స్ ఉందని.. కాదు క్రేజ్ కోసమైతే మరీ టాప్ కాకపోయినా కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్ ని తీసుకుంటారని అంటున్నారు.

Who plays Pawan Wife Role in Ayyappanum Koshiyum remake:

Priyamani for Ayyappanum Koshiyum remake 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs