బాహబలి క్రేజ్ తర్వాత ప్రభాస్ భారీ బడ్జెట్ తో యాక్షన్ మూవీ సాహో చేశాడు. బాహుబలి అంచనాలను సాహోతో ప్రభాస్ అందుకోలేకపోయాడు. హాలీవుడ్ స్టాండెడ్స్ తో తెరకెక్కించిన సాహో ఏ భాషా ప్రేక్షకులను శాటిస్ ఫై చెయ్యకపోయినా.. యాక్షన్ అంటే ప్రాణం పెట్టే బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రం అలరించింది. సాహో సినిమాతో ప్రభాస్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. అంతేకాదు.. ఆయన క్రేజ్ కి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. అయితే ప్రభాస్ సాహో కోట్లలో కొల్లగొడుతుంది అనుకుంటే.. కంటెంట్ పరంగా సినిమా బాగా దెబ్బేసింది. థియేటర్స్ లో సాహో ప్లాప్ అయ్యింది.
అక్కడ థియేటర్స్ లోనే కాదు.. బుల్లితెర మీద సాహో అట్టర్ ప్లాప్ అయ్యింది. సాహో విడుదలైన ఏడాది తర్వాత సాహో శాటిలైట్ హక్కులు కొన్న జీ తెలుగు సాహో సినిమాని ప్రసారం చేసింది. అయితే సాహో కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూసారు అనే విషయం సాహో టీఆర్పీతో తేలిపోయింది. సాహో సినిమా నచ్చకపోయినా లాక్ డౌన్ వలన అమెజాన్ ప్రైమ్ లోనే చాలామంది వీక్షించేసిన తర్వాత జీ ఛానల్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అంటూ హడావిడి చేసినా సాహో సినిమాని బుల్లితెర ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. భారీ బడ్జెట్ సినిమాలకు ఏ సినిమాకి రాని ఘోరమైన టీఆర్పీ సాహోకి వచ్చింది. ఈ సినిమాకి కేవలం 5.8 టీఆర్పీ రేటింగ్ మాత్రమే రావడం అందరికి షాకిచ్చింది.