Advertisement
Google Ads BL

పవన్ సినిమాలో నటించేది రానానా? లేక..?


పవన్ కళ్యాణ్, శేఖర్ కె చంద్ర దర్శకత్వం లో మలయాళం అయ్యప్పన్ కోషియం రీమేక్ చెయ్యబోతున్నాడు. అయితే పవన్ వరస సినిమాల వలన ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేకపోయినా... ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ ని శేఖర్ పూర్తి చేసి పవన్ నుండి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడనే టాక్ ఉంది. అయితే అయ్యప్పన్ కోషియమ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా మరో హీరో ఉండాల్సి ఉంటే...ఆ హీరో పాత్రలో రానా నటిస్తాడని టాక్ సోషల్ మీడియాలో ఎప్పటినుండో ప్రచారంలో ఉండగా..ఈ సినిమా ప్రకటించి రెండు మూడు రోజులైన రానా ఈ సినెమా విషయంలో ప్రకటన ఇవ్వకపోవడం, అసలు ఈ సినిమాపై రానా స్పందించకపోవడం చూసిన వారు రానా.. పవన్ కళ్యాణ్ మలయాళ రీమేక్ లో నటించడం లేదేమో అనే అనుమానం వ్వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
CJ Advs

పవన్ తో సినిమా అంటే రానా ఊరుకుంటాడా? తన ఆత్రాన్ని ఈపాటికి అభిమానులకు షేర్ చేసేవాడే. అయితే రానా కాకపోతే పవన్ సినిమాలో మరో హీరోగా పవన్ భక్తుడు నితిన్ నటించవచ్చేమో అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయ్యప్పన్ కోషియమ్ సినిమాలో ఇద్దరు హీరోల పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. అయితే పవన్ సినిమాలో కేరెక్టర్ అనగానే హీరో నితిన్ ఓకే చెప్పెయ్యొచ్చు. అలాగే ఈ సినిమాలో పవన్ తో నితిన్ కలబడవచ్చేమో అనే రూమర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి పవన్ సినిమాలో రానానా? లేదా నితినా? అని తెలియాల్సి ఉంది.

One More Hero Name for Pawan Ayyappanum Koshiyum Remake:

Who is second hero in Ayyappanum Koshiyum Remake?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs