బాహుబలితో అనుష్క, తమన్నా పాన్ ఇండియా లెవెల్ సినిమా చేసినా అనుష్క బరువు వలన తర్వాత తన బాహుబలి క్రేజ్‌ని కాపాడుకోలేకపోతే.. తమన్నా కూడా బాహుబలి క్రేజ్‌ని నిలబెట్టుకోలేకపోయింది. ఇక ప్రభాస్ సాహోతో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ పాన్ ఇండియా మూవీ చేసినా.. శ్రద్ద కపూర్ కి సాహో ప్లాప్ దెబ్బ మాములుగా పడలేదు. ఇక మిగిలింది... ప్రభాస్ తో రాధేశ్యాం చేస్తున్న పూజాహెగ్డే. ఈమధ్యన రాధేశ్యామ్ సోషల్ మీడియాలో బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ అంటూ అదరగొట్టింది. పూజాహేగ్డేకి పాన్ ఐడియా అప్పీల్ వచ్చేసింది. అల వైకుంఠపురములో కన్నా ముందు భారీ హిట్ లేదు. అల వైకుంఠపురములో బ్లాక్ బస్టరవడంతో పూజా రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది అని అన్నారు.
అఖిల్ సినిమాలో హాట్‌గా నటించేందుకు బాగానే వసూలు చేసింది అంటున్నారు. అన్నట్టుగానే అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లో పూజా హాట్ అందాలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అనేది టీజర్ లో చూశాం. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత వలన స్టార్ హీరోలందరికీ పూజాహెగ్డే, లేదంటే రష్మిక లేదంటే బాలీవుడ్ హీరోయిన్స్ తప్ప వేరే ఛాయస్ లేకుండా పోయింది.
అయితే నిన్నమొన్నటివరకు సౌత్ సినిమాలు, బాలీవుడ్ మూవీస్ సపరేట్ సపరేట్ గా చేసుకున్న పూజాహెగ్డే రాధేశ్యామ్‌తో పాన్ ఇండియా లెవల్ మూవీ చేస్తుంది కాబట్టి నిన్నమొన్నటి వరకు కోటి, కోటిన్నర అందుకున్న పూజా ఇప్పుడు రెండున్నర కోట్లు అడుగుతుంది. ఏమన్నా అంటే పాన్ ఇండియా క్రేజ్ ఉంది.. మీ ఇష్టం అంటుందట. పాన్ ఇండియా అయితే ఓకే.. కానీ రెండున్నర కోట్ల అంటే కష్టమంటున్న సౌత్ నిర్మాతలు పూజాహెగ్డేకి మరో ఆప్షన్ వెతుకుంటున్నారట.