Advertisement
Google Ads BL

సినిమా రిలీజ్‌ల విషయంలో తేల్చుకోలేకపోతున్నారా?


సినిమాలకు అతి పెద్ద పండగ దసరా కరోనా కాటుకి బలైంది. దసరా రోజు కేవలం ఓపెనింగ్స్, కొత్త పోస్టర్స్, టీజర్స్ తోనే హీరోలంతా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే సినిమాని విడుదల చేసి హ్యాపీగా రిలీజ్ ప్రెస్ మీట్ పెట్టడానికి లేదు. అయితే ఈ దసరాకి థియేటర్స్ తెరుచుకున్నా సినిమాల విడుదలకు హీరోలెవరు ధైర్యం చెయ్యలేదు. కానీ గత ఏడాది వరకు డిసెంబర్‌లో సినిమాలకు అతి పెద్ద క్యూ ఉండేది. అయితే ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎవరూ సినిమాలు విడుదలకు మొగ్గు చూపలేదా? లేదు ఎందుకంటే చాలా సినిమాలను సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటించేశారు. అయితే అవేమన్న భారీ బడ్జెట్ సినిమాలా అంటే కాదు.. చాలావరకు మీడియం సినిమాలే.

Advertisement
CJ Advs

అయితే డిసెంబర్ 20 నుండి 30 వరకు క్రిష్టమస్ హడావిడిలో సినిమాలు రిలీజ్ చెయ్యడానికి మీడియం హీరోలు మొగ్గు చూపేవారు. అంటే సాయి ధరమ్ తేజ్, రామ్, రవితేజ, నాగ చైతన్య, నాని లాంటి హీరోలకి డిసెంబర్ బాగా కలిసొచ్చే నెల. డిసెంబర్ కాకపోతే మళ్ళీ వీళ్లకి ఫిబ్రవరిలో థియేటర్స్ ఉంటాయి. కానీ సంక్రాంతి పండగ వచ్చేసరికి మీడియం బడ్జెట్ హీరోలు సాహసించరు. ఎందుకంటే ఆ టైంలో భారీ బడ్జెట్ పెట్టుకుని స్టార్ హీరోలు బరిలో ఉంటారు కాబట్టి. కానీ ఈ సంక్రాంతికి స్టార్ హీరోలు ఎవరూ ముందు వచ్చేలా లేరు. కాబట్టే రవితేజ, రామ్, అఖిల్ లాంటి హీరోలు రెడీ అయ్యారు.

అయితే సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరు, నాగ చైతన్య లవ్ స్టోరీ, వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలు షూటింగ్స్ అయినా విడుదల డేట్స్ లాక్ చెయ్యలేదు.. కనీసం సంక్రాంతికి రిలీజ్ అని కూడా చెప్పలేదు. అంటే వీళ్ళేమైనా డిసెంబర్ చివరి వారంలో కర్చీఫ్ వేసే ఛాన్స్ ఉందా? అందుకే దసరాకి ఎలాంటి హడావిడి చెయ్యకుండా నవంబర్ దివాళికి తమ సినిమాల రిలీజ్ డేట్స్ ప్లాన్ చేశారా? అనేది కాస్త సస్పెన్సులో ఉన్న విషయమే.

Corona effect continues in Tollywood:

Heroes in dilemma in their movies release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs