Advertisement
Google Ads BL

అందుకే పవన్‌తో త్రివిక్రమ్‌ చేయడం లేదా?


పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ స్నేహం గురించి ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ స్నేహం ఎప్పటిదో. అయినప్పటికీ.. పవన్ కళ్యాణ్ అడిగితే త్రివిక్రమ్ కాదంటున్నాడనే టాక్ పవన్ వకీల్ సాబ్ నుండి ఇప్పటి అయ్యప్పన్ కోషియం రీమేక్ వరకు వినిపిస్తూనే ఉంది. పింక్ రీమేక్ చేసి టాలీవుడ్ కి మళ్ళీ రీ ఎంట్రీ ఇమ్మని త్రివిక్రమ్ చెబితేనే పవన్ మల్లి సినిమాలు చేస్తున్నాడు. అప్పుడే వకీల్ సాబ్ రీమేక్ ని త్రివిక్రమ్ నే డైరెక్ట్ చెయ్యమంటే కాదు కూడదని.. దానిని వేణు శ్రీరామ్ చేతుల్లో పెట్టాడట. ఇక పవన్ వరసబెట్టి సినిమాలు ప్రకటిస్తుంటే అందులో స్నేహితుడు త్రివిక్రమ్ సినిమా కానరావడం లేదు. అంటే త్రివిక్రమ్ - పవన్ కాంబో ఇప్పట్లో లేదా?

Advertisement
CJ Advs

తాజాగా పవన్ కళ్యాణ్ సితార ఎంటర్టైన్మెంట్ లో మలయాళ అయ్యప్పన్ కోషియం రీమేక్ చెయ్యబోతున్నాడు. దానికి శేఖర్ కె చంద్ర అనే చిన్న దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ కి ఈ అయ్యప్పన్ కోషియం అయితే పర్ఫెక్ట్ అని త్రివిక్రమ్ చెప్పాడట, దానితో ఆ సినిమా రీమేక్ కి ఒప్పుకున్న పవన్ ఈ సినిమాని నువ్వే రీమేక్ చెయ్యమని త్రివిక్రమ్ ని అడిగినట్లుగా తెలుస్తుంది. అయితే త్రివిక్రమ్ ఎందుకు వద్దన్నాడంటే అప్పట్లో పింక్ రీమేక్ విషయంలో వేణు శ్రీరామ్ చేసిన వర్క్ కి త్రివిక్రమ్ హెల్ప్ అయినట్లుగానే ఇక్కడ శేఖర్ కె చంద్ర అయ్యప్పన్ రీమేక్ వెర్షన్ పనులకి త్రివిక్రమ్ జస్ట్ హెల్ప్ చేసాడంతే. అంతేకాకుండా త్రివిక్రమ్ కథలను కాపీ కొట్టినా రీమేక్స్ చెయ్యడం అనేది నచ్చదని టాక్ ఉంది. సో అందుకే పవన్ అడిగిన పింక్ రీమేక్ కానీ.. ఇప్పుడు అయ్యప్పన్ కోషియం రీమేక్ కానీ త్రివిక్రమ్ చెయ్యనని చెప్పేసాడు.

No film in Pawan and trivikram combo.. this is the reason:

Reason behind no movie in Pawan and Trivikram Srinivas combo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs