Advertisement
Google Ads BL

మరో సినిమా.. మరి పాలిటిక్స్‌ సంగతేంటి పవన్‌?


ప్రస్తుతం ఏపీ రాజకీయాలు యమా హాట్‌గా ఉన్నాయ్. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కి, ఏపీ ప్రభుత్వానికి మధ్యన వార్ నడుస్తుంది. కరోనా టైంలో ఎన్నికలేమిటి అంటుంది ఏపీ ప్రభుత్వం. మరి కరోనా టైంలోనే జగన్ ప్రభుత్వం స్కూల్స్ ఓపెన్ చేస్తుందట కానీ ఎన్నికలు వద్దంటుంది. ఏపీలో మాటల యుద్ధంతో హాట్ హాట్‌గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీ రాజకీయాలతో పని లేదన్నట్టుగా కామ్ అయ్యాడు. నిన్నటివరకు వరద బాధితులకు ప్రభుత్వాలు విరాళాలు సేకరించారు... అందులో కేసీఆర్ నెంబర్ వన్ అయితే జగన్ గారు ఎక్కడ అని విమర్శించిన పవన్ ప్రస్తుతం రాజకీయాలు వదిలేస్తాడేమో అనే అనుమానం అందరిలో మొదలైంది.

Advertisement
CJ Advs

ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలు చూస్తే పవన్ రాజకీయాలకు రాం రాం చెప్పి సినిమాలు చేసుకుంటాడేమో అనిపిస్తుంది. ముందు పింక్ రీమేక్ వకీల్ సాబ్‌ని ఒప్పుకుని రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ తర్వాత క్రిష్ తోనూ, హరీష్ శంకర్ తోనూ సినిమాలు ప్రకటించాడు. పోనిలే ఈ మూడు చేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోతాడనుకుంటే.. పుట్టిన రోజు నాడు సైరా దర్శకుడు సురేందర్ రెడ్డితో మరో సినిమా అనౌన్స్ చేసి షాకిచ్చాడు. సరే అయితే అనుకునే లోపు దసరా రోజున మరో సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ కి చేస్తున్నట్లుగా ప్రకటించాడు. మరి ఈ సినిమాలన్నీ పూర్తి కావాలంటే మరో మూడేళ్లు ఖాయం. 

పవన్ పనితనం అందరికి తెలుసు. ఎంత ఫాస్ట్‌గా ఉంటాడో అనేది. మరి పవన్ ఈ సినిమాలను చేస్తూ ఇంకేం రాజకీయాలు చేస్తాడు.. రాజకీయాల్లో జీరోగా మిగిలిన నాకు ఇంక రాజకీయాలెందుకు అనుకున్నాడా? లేదంటే సినిమాలు రాజకీయాలు రెండు కళ్ళంటాడా? చూద్దాం పవన్ ఏం చెబుతాడో అనేది.

Pawan Kalyan announced One more Movie:

Pawan Kalyan in full swing for Movies..not politics
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs